నరకయాతన ఒక అబ్బాయి... మధ్యతరగతి కుటుంబం లో పుట్టి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ..వాళ్ళ తల్లితండ్రుల కన్నీరు చూడలేక.. తుడవలేక.. ఎం చేయాలో అర్థం కాక... చదువు పేరుతో బయటికి వచ్చేశాడు... అప్పటి నుండి అటు చదువుతూ.. తన ఖర్చులకు సరిపడు ఏదో ఒక పని చేసుకుంటూ గడుపుతున్నాడు.. ఇంట్లో అమ్మ నాన్నలకి చెప్పి ఏదో ఒక పని చేస్తూ చదువుకుంటానని అన్నాడు... అపుడు ఆ తల్లితండ్రులు మేము ఉన్న అన్ని రోజులు నీకు ఎలాంటి కష్టం కలగనివ్వము... మేము చదువుకోక ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నము.. నీకు చెల్లికి అలాంటి పరిస్తితి రాకూడదు అనే మాకు ఎంత కష్టమైన మీరు భారం అనుకోకుండా మా బాధ్యత అని చదివిస్తున్నము అని అంటారు అపుడు ఆ అబ్బాయి సరే అమ్మ అని ఫోన్ పెట్టేసాడు.. వెంటనే ఆమె భర్త పక్కనుండి, అదేంటే అలా అన్నావు.. వాడు ఏదో ఒక పని చేస్తూ చదువుకుంటానని అన్నాడు…