నీరు కారిన రైతు గుండె
నీరు కారిన రైతు గుండె వేసవి కాలం పూర్తి అయింది.. ఇగ వర్షాకాలం మొదలయింది.. పొలం దుక్కి దున్ని... పంటకు కావలసినవి అన్నీ సిద్ధం చేసుకున్నాను... పంట వేశాము విత్తనాలు వేసాము... కొన్ని రోజులకు మొలక వచ్చాయి.. మందులు చల్లాము.. పంట పచ్చదనం తో పలకరిస్తుంది.. ఎంతో సంతోషం తో ఉల్లాసంగా... ఇంకా పెట్టుబడి పెట్టాలి... పోయి ఏడు పంట నష్టం బాగా వచ్చింది... ఆదుకుంటాం అన్నవారు హామీ ఇచ్చిన వారు కంటికి కూడా కనపడలేదు ప్రభుత్వాధికారులు... ఎం చేస్తాం నమ్ముకున్న పంట చేతికి రాలేదు.. అమ్మలా చూసుకున్న భూదేవి కరునించలేదు.. అలాంటిది.. ఈ అధికారులు ఎం చేస్తారు అని అప్పు ఇచ్చే వారిని నమ్ముకుని నా భార్య బిడ్డలకు కడుపు నింపడం కోసం అప్పులు ఎన్నో చేశాను.. రైతే రాజు అని గొప్పలకు నినాదాలు పలికే వారే కానీ ఆ రాజు నీ కనీసం మనిషిలా కూడా చూడడం లేదు ఎవరు..…