nootana nirnayam by bhavya charu

నూతన నిర్ణయం

నూతన నిర్ణయం నమస్తే అండి నా పేరు అంజలి. నేనొక ఒంటరి మహిళను నాకొక బాబు. నేను వాడి కోసమే బ్రతుకుతూ ఉన్నాను. పిల్లలుంటే చాలు అండి పిల్లల కోసమే కదా మనమేం చేసినా అందుకే నేను వాడు పుట్టినప్పటి నుండి ఏదో ఒక పని చేస్తూ ఉండేదాన్ని. అయితే వాడిని ఇంట్లో అమ్మ దగ్గర వదిలేసి పనికి వెళ్ళేదాన్ని టీచర్ గా నా ప్రయాణం మొదలైంది. పొద్దున్నే పాలు పట్టి వెళ్ళడం, మధ్యాహ్నం వచ్చి మళ్ళీ పాలు పట్టి వెళ్లేదాన్ని, అలా పని చేస్తూ వాడి చిన్న చిన్న అవసరాలు తీరుస్తూ ఉండేదాన్ని. నిజానికి వాడిని అమ్మే చూసుకునేది. అమ్మనే అన్ని విధాలా చేసేది. అలా గడుస్తూ ఉండగా ఒక రోజు మధ్యాహ్నం ఎప్పటిలా ఇంటికి వచ్చేసి అన్నం తిని వాడికి పాలు పట్టి వెళ్దాం అనుకునే లోపు ఏడుపు మొదలు పెట్టాడు. వెళ్లొద్దు అన్నట్టుగా నాకు కాస్త జాలిగా…
Read More