న్యాయం.. ఆనవాళ్ళు
న్యాయం.. ఆనవాళ్ళు అడుగడుగునా అన్యాయం.. అంతటా అన్యాయం.. అన్నింటా అన్యాయం.. న్యాయపు వెలుగు రేఖలు చూడని సూర్యోదయం.. న్యాయపు ఆనవాలు లేక అస్తమిస్తోన్న సూర్యాస్తమయం.. న్యాయం ఓ భరోసా.. న్యాయం ఓ ఆశ.. న్యాయం ఓ వెలుగు రేఖ న్యాయం ఓ విశిష్టత న్యాయం ఓ విప్లవం న్యాయం ఓ సామాజిక బాధ్యత.. న్యాయం కోసం విలవిలలాడుతూ, అన్యాయపు శృంఖలాలో నలిగి రాలిపోతున్న వారందరికీ మరియు న్యాయ స్థాపన పోరాట వీరులకు/ధీరులకు చేస్తున్నాను లాల్ సలాం - కిరీటి పుత్ర రామకూరి