oka cheekati raatri story aksharalipi

ఒక చీకటి రాత్రి పార్ట్ ౩

కానీ ఇంతలో దుప్పటి లాగసాగింది ఆకారం. ఇంకా గట్టిగా బిగించాడు. అయినా గట్టిగా లాగుతుంది ఏదో శబ్దం చేస్తోంది. ఇంకా గట్టిగా బిగించాడు. లే.... లే... లే... అంటున్న శబ్దం వినిపించింది చేతనకి. వామ్మో ఇది, ఇది నన్ను లేవమని అంటుంది ఏంటి అని భయపడ్డాడు చేతన్. లే..... లే..... లే.... అన్న శబ్దం ఇంకా గట్టిగా వినిపించ సాగింది. వామ్మో ఇది నన్ను ఏదో చేసేలా ఉంది ఎలా భగవంతుడా... వద్దు నేను లేవను, నేను లేవను. అంటూ ఇంకా దుప్పటి ముసుగు పెట్టాడు చేతన్. ఓరి నీ యబ్బ లేరా అంటే ఏంట్రా ఇంకా పడుకున్నావ్...? ఏంట్రా పరీక్షకు టైం అవుతుంది సిగ్గు లేదు? ఇంకా ఎంతసేపు పడుకుంటావు అంటూ ఇద్దరు స్నేహితులు కలిసి దుప్పటిని లాగేశారు. గబుక్కున కళ్ళు తెరిచి చూసిన చేతన్ కి ఎదురుగా ఇద్దరు స్నేహితులు కనిపించేసరికి సంతోషంగా అనిపించింది. చుట్టూ చూస్తూ, దయ్యం…
Read More