ontari

ఒంటరి

ఒంటరి "నేనస్సలు వెళ్ళను. నాకసలు హాస్టల్ ఇష్టం లేదు."అంటూ అమ్మ దగ్గర మారం చేస్తున్నాడు పదేళ్ల వినయ్. "మరి నీకేమిష్టం?" అడిగింది తల్లి.  "మరేమో నాకు నువ్వంటే ఇష్టం. నాన్నతో బజారుకు వెళ్లడం ఇష్టం. ఇంటి పక్కన ఫ్రెండ్స్ అందరితో క్రికెట్ ఆడుకోవడం ఇష్టం. నువ్వు అన్నం తినిపిస్తే ఇష్టం. చెల్లితో గొడవ పడడం ఇష్టం. మన జూలితో (పెంపుడు కుక్క) ఆడడం అంటే ఇష్టం. ఎక్వేరియంలో చేపలతో మాట్లాడడం ఇష్టం. నేను దగ్గరుండి నాటిన మొక్కలకు నీళ్లు పోయడం ఇష్టం. బాల్కనీలో కూర్చుని ఉయ్యాల ఊగుతూ ఆకాశంలో చుక్కలు చూడడం ఇష్టం. అమ్మమ్మ ఊరు అంటే ఇష్టం. మరేమో ఇంకా..." అంటూ ఆలోచిస్తూ ఏవో చెప్పబోతున్న కొడుకును వారించి "అలా అంటే ఎలా చిన్నోడా! నువ్వు హాస్టల్ కి వెళ్ళను అంటే ఎలా చెప్పు? మా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాం. నువ్వు హాస్టల్ కి వెళ్లి చక్కగా చదువుకోవాలి.…
Read More

“ఒంటరి” నవల సమీక్ష

"ఒంటరి" నవల సమీక్ష కొన్ని పుస్తకాలు కొందామని, NTR స్టేడియం హైదరాబాద్లో 2019 డిసెంబర్లో జరిగిన పుస్తక ప్రదర్శనకు వెళ్ళడం జరిగింది. అక్కడ అనుకోకుండా ఒక షాపులో 'ఒంటరి' నవల చూడటం, కొన్ని పేజీలు చదవడం.... చదివిన దగ్గరనుండి ఎప్పుడెప్పుడు మొత్తం చదువుదాం అనే అతృతతో పుస్తకం కొనుక్కొని వచ్చి నిరంతరాయంగా చదవడం అలా జరిగిపోయింది. నేను చదివిన కొన్ని నవలలో, ఏకబిగిన పట్టుబట్టి మొత్తం అయిపోయెవరకు చదివేలా చేసిన గొప్ప నవలలో ఒంటరి ఒకటి అని అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఈ నవల రెండు భాగాలుగా సాగింది, ఒకటి - పేరు ప్రఖ్యాతలు, కావల్సినంత ధనం గడించిన ఒక డాక్టర్.. ఆరోగ్యపరంగా ఇబ్బందికి లోనై, ఆ క్రమంలో తన ఆరోగ్యం బాగు దృష్ట్యా అంతరించిపోతున్న ధాన్యపు జాతి కోసం ఆరు నెలల అన్వేషణ. రెండవది - తన ప్రాణవాయువుతో పొలాన్ని బుజ్జగించి, సమస్త జీవకోటితో అత్యంత సహజంగా ప్రకృతిలో…
Read More