paruvu le kha ka by mamidala shailaja

పరువు లే(ఖ)క

పరువు లే(ఖ)క మానవత్వపు విలువలను మృగ్యం చేస్తున్న మనువాద సిద్దాంత భావజాలాన్ని చెక్కుచెదరకుండా చేతులొడ్డి కాపాడుతున్న సనాతన సాంప్రదాయ సమాజానికి నా ఈ పరువు లే(క)ఖ... ఒకప్పుడు పూర్వపు ఉమ్మడి కుటుంబాలలోని సభ్యులు కుటుంబ యజమాని యొక్క ఆంక్షలకు లోబడి కుటుంబ పరువు ప్రతిష్టలు, గౌరవానికి భంగం కలగకుండా అతని ఆదేశానుసారం అణకువగా ప్రవర్తించేవారు. రాను రాను ఉమ్మడి కుటుంబాల స్థానంలో వ్యక్తిగత కుటుంబాలు ఏర్పడి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు లభించాయి. నా కుటుంబం, నేను అనే భావన సంకుచితమైపోయింది. ఒకప్పుడు ఇంట్లో మూల స్తంభాలుగా ఉన్న పెద్దవాళ్ల ఆజ్ఞలకు, వాళ్ళ కోరికలకు విలువ ఇవ్వడం తగ్గిపోయింది. ఒకప్పుడు పెద్ద వాళ్ల నిర్ణయాలకు తలోగ్గి వాళ్లు నిర్ణయించిన జీవిత భాగస్వామితో వివాహబంధంలో అడుగు పెట్టేవారు. మారుతున్న పరిస్థితులలో వ్యక్తి స్వేచ్ఛావాదం పెరిగింది. తమ జీవిత భాగస్వామిని నిర్ణయించుకోవడంలో పిల్లలు స్వేచ్ఛ తీసుకుంటున్నారు. సరిగ్గా ఇక్కడే ఏర్పడింది అసలు సమస్య. కులాలు, మతాలు, ఆర్థిక…
Read More