peeka koothatho tappika peeka kotha

పీక కూతతో తప్పిన పీక కోత

పీక కూతతో తప్పిన పీక కోత కొన ఊపిరితో కొట్టుమిట్టాడు తున్నాడు రాజు.. వేగంగా వెళ్తున్న ఒక ఇసుక లారీ అతని సైకిల్ ని గుద్దేసి ఆపకుండానే ముందుకు దూసుకొని వెళ్ళిపోయింది. అతని తలకు బలమైన గాయం అవ్వడంతో విపరీతంగా రక్తస్రావం అవుతోంది. ఇంతలో ఎవరో ఒక దయగల మహానుభావుడు ఈ విషయాన్ని ఆంబులెన్స్ నిర్వాహకులకు తెలియజేశాడు. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి రాజుకి మాట్లాడడానికి శక్తి చాలటం లేదు. అక్కడ గుమిగూడిన వాళ్ళలో ఒకరికి చేతివేళ్ళు చూపుతూ దగ్గరికి పిలిచాడు. ఆ మనిషి లో ఎక్కడో మానవత్వం ఉంది.. దగ్గరికి వెళ్లి 'చెప్పండి' అన్నాడు.. రాజు తన షర్ట్ జేబులో ఉన్న ఒక చిన్న పుస్తకాన్ని బయటికి తీయ వలసినదిగా అతనిని కోరాడు. రాజు కోరిన విధంగా ఆ పుస్తకాన్ని తీసి తెరిచాడు ఆ మానవతావాది. అందులో అన్నీ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. " చెప్పండి సార్ ఇందులో ఫోన్ నెంబర్లు…
Read More