pempakam by bhavya charu

పెంపకం

పెంపకం నాడు: తల్లిదండ్రుల పిల్లలను మూడున్నర కు నిద్రలేపి ఇంటి పనులు చేయించేవారు. అంటే గోవులకు గడ్డి వేయడం, పాలు పితకడం, గోషాలని శుభ్రం చేయడం వంటివి చేయించేవారు. ఆ తర్వాత పాలు అమ్మడానికి కూడా పిల్లలని పంపించేవారు. పాలు అమ్మి వచ్చాక ఇంట్లో ఉన్నదేదొ తినేసి పుస్తకాలు తీసుకుని నాలుగైదు కిలోమీటరు దూరం లో ఉన్న పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను వల్లే వేస్తూ ఉపాధ్యాయులకు గౌరవం ఇస్తూ వారికి సేవలు చేస్తూ చదువు నేర్చుకునేవారు. చదువుకుంటే సంస్కారం అలవడుతుంది. గొప్ప ఉద్యోగాలు సంపాదించవచ్చు అనేది తల్లిదండ్రుల ఆలోచనతో ఎంత కష్టం అయినా పాఠశాలకు వెళ్లి చదువుకుంటూ అన్ని పనుల్లో తల్లిదండ్రుల కి చేదోడు వాదోడుగా నిలుస్తూ తమ తెలివిని పెంచుకుంటూ ఉండేవారు. గురువులు అంటే అమితమైన భక్తి చూపేవారు. మా రోజుల్లో అయితే మేము చదువుకునేటప్పుడు మా నాన్నగారు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేసేవారు. మా నాన్నగారు…
Read More