అతివృష్టి – వరదబాధలు
అతివృష్టి - వరదబాధలు 1) నిన్న మొన్న తాగనీరు లేకనుమాడి జీవరాసులెన్నొ జీవమిడిచె మిగిలినట్టి పసులు మున్నీట వరదల్లొ దీనముగ దివిజనె దిక్కు లేక 2) ఉగ్రరూపగంగ ఉరకలెత్తి పొంగె కంటనీరు నింపి.పంటముంచి కట్టుకున్న యిండ్ల కనుల ముందే కూల్చి ప్రాణములను దీసి పాతరేసె 3) నిలువ నీడ లేదు.నీరు తాగనులేము ఆదుకొనెడి బంధువండ లేరు మనసు చెదరి పోయె.మార్గాలువెదకగా దారులన్నిజూడ ధారుణమ్ము 4) ఇండ్లు కూలిపోయె ఇక్కట్లు మొదలాయె పంటచేలు అన్ని కుంట మునిగె అడవి జంతువులకు ఆలంబనే లేదు సాదుజంతువులకు పాదులేదు 5) మంచినీరు లేదు మాత్రలు లేవాయె రోగమొచ్చెనంటె మూగనోము ప్రాణమున్న చాలు బతుకు బరోసకు అన్నపానమేది అందకున్న 6) కాశ్మిరమ్మునుండి కన్యాకుమారికి వరద వెల్లువెత్తె వరుసగాను నదులు పొంగిపొర్లి నాశనమొనరించె …