ramya palepu

ఆడాళ్ళు మీకు జోహార్లు

ఆడాళ్ళు మీకు జోహార్లు ఆడపిల్ల అని అన్నింటా ఆంక్షలు విధించిందినా కని పెంచిన పాసానికి బంధీగా బతుకుతున్న ఆడాళ్ళు మీకు జోహార్లు... ఏ తప్పూ చేయకుండా వివాహ ఖైదీగా మెట్టినింటి జైలులోకి అన్యాయంగా నెట్టబడినా నవ్వుతో బాధని దాచే ఆడాళ్ళు మీకు జోహార్లు... పదిహేనేళ్లగా కష్టపడిన చదువుకి లంచం ఇచ్చి మరీ కోడలి ఉద్యోగం అంటగట్టినా జీతంగా బానిసత్వాన్ని తీసుకుంటూ ఉనికినే త్యాగం చేసే ఆడవాళ్ళు మీకు జోహార్లు... కుటుంబాన్ని నడుపుతూ మీ అభివృద్ధికి అడ్డోచ్చే కుటిల మనస్తత్వాలను మసి చేస్తూ పట్టువిడవకుండా పోరాడుతూ కలల ప్రపంచాన్ని పాలిస్తున్న ఆడాళ్ళు మీకు జోహార్లు... - రమ్య పాలెపు
Read More

అనుభవమే గురువు

అనుభవమే గురువు జీవితం చాలా చిన్నది కాబట్టి ప్రతీ క్షణాన్ని ఒడిసి పట్టుకుని ఆస్వాదించాలి అనుకునేది కొందరైతే ఎంత పెద్ద జీవితం ఇది పుట్టినప్పటి నుంచీ కాటికి కాళ్లు చాపే వరకూ ఎన్ని చూస్తాం, ఎన్ని చేస్తాం. పుడతాం చదువుకుంటాం, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, పిల్లలు, సంసారం, బాధ్యతలు, ఒడిదుకులు, కష్టాలు, నష్టాలు, మరుపురాని క్షణాలు, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, అబ్బో ఇలా ఎన్నో ఎన్నెన్నో అనుకునే వారు మరికొందరు. సాధారణంగానే మనిషి ఆశాజీవి. ఆశృవులు తెలీని మనిషి ఉంటాడేమో కానీ ఆశలు లేని మనిషి ఉండడు. మనకి ఊహా తెలిసినప్పటి నుండి ప్రతీ రోజు ఎదో ఒక దాని మీద ఆశ పడతాం, ఏవేవో కలలు కంటాం. చిన్ననాటి నుంచే భవిష్యతలో ఇది అవ్వాలి, అది అవ్వాలి అని అనుకుంటూ ఉంటాం. అనుకున్నది సాధించడానికి తగిన కృషి కూడా చేస్తాం. కానీ... కాలం చాలా తుంటరిది. మనం కోరుకున్నది కాకుండా…
Read More

తెగువ చూపవే మగువ

తెగువ చూపవే మగువ ఇంటా బయటా ఒకటే రోత పసి పాపంటూ ముసలమ్మంటూ తేడా చూడక, మదమెక్కిన కామపిసాసుల కర్కశ కోరిక కాటేస్తుంటే, విషాన్ని మొత్తం మగువల బతుకున ఒంపేస్తుంటే బలి అవుతున్న ప్రాణాలెన్నో... చుట్టం పేరుతో ముచ్చట ముసుగులో లోకం ఎరుగని చిన్న పిల్లలనీ తప్పుడు చూపుతో చూసేదోకడు... గురువు పేరుతో చదువు వంకతో చేతులు నలిపే నికృష్టుడొకడు... కళాశాలలో ప్రేమ పేరుతో యాసిడ్ దాడితో మాయని మచ్చను మనసులో ముద్రించేదొకడు... పెళ్ళి పేరుతో బాధ్యత వలలో ఊపిరికి ఉరి బింగించే మహానుభావుడు ఒకడు... క్షణ క్షణము రణము అడుగడగు భయము మనసే అయ్యెను శవము పిరికితనంతో వెర్రి భయంతో భాదని భరిస్తే,అన్యాయాన్ని సహిస్తే మారదు లోకం, ఆగదు శోకం ఉప్పెన నీవై ఉరకలు తియ్ నిప్పులు చిమ్ముతు మసిచేసెయ్ కంటి చూపుతో కత్తై పొడిచెయ్ నీచులందరిని నిలువునా పాతెయ్ - రమ్య పాలెపు
Read More