renu writings

తను నేను ఓ వనిత

తను నేను ఓ వనిత ఓ రోజు మధ్యాహ్నం వేళ అమ్మ నా దగ్గరికి వచ్చి, "మూడు సంవత్సరాల తరువాత ఆస్ట్రేలియా నుండి బావ వచ్చాడు వచ్చి కూడా నెల గడుస్తుంది. వెళ్లి పలకరించకపోతే అత్త ఏమనుకుంటుంది" అనడంతో ఆ రోజు సాయంత్రం అత్త వాళ్ళ ఇంటికి వెళ్లా. గేట్ లోపలికి వెళ్ళగానే వాచ్మెన్ వచ్చి "ఎవరు లేరమ్మ బయటికి వెళ్లారు", అనగానే చిరాకుతో మళ్ళీ ఇంకోరోజు రావాలా అని మనసులో అనుకుంటూ వెనుతిరిగిన మరుక్షణం "అమ్మా !సార్ మేడం బయటికి వెళ్లారు, వాళ్ళ బాబు ఉన్నారు" అని వినిపిస్తున్న వాచ్మెన్ మాటలతో హమ్మయ్య! హాయ్ చెప్పి వెళ్లిపోదాం ఒక పని అయిపోతుంది అనుకుంటూ లోపలికి వెళ్ళగానే హాల్ లో చింపి పడేసిన రెండు పేపర్లు కనిపించాయి. పట్టించుకోకుండా ఇల్లు అంతా చూసా, ఎవరు లేరు. బావ రెండవ ఫ్లోర్లోని తన రూమ్ బాత్రూములో ఉన్నట్టు గమనించా. హాల్ లోని సోఫాలో…
Read More