సంతృప్తి
సంతృప్తి సంతృప్తి అంటే బంగారు గని కాదు అది? మనిషి మనసులోని చిక్కుముడి అది విప్పితే దొరుకుతుంది వెచ్చించిన యోగం! అహం వీడితే అదృష్టం వాస్తవం ఎరిగితే సరితూచే సంతృప్తి ! భోగాన్ని వీడితే సంతృప్తి ! సమస్యను స్వీకరిస్తే సంతృప్తి! అవధులు లేని సంతోషాన్ని అదుపు చేస్తే సంతృప్తి! మది నచ్చిన పనితో కలిగేదిఅంతులేనిసంతృప్తి! మాట వినని మనసుకు కళ్ళెం వేస్తే కలిగేదిసంతృప్తి ! కోరికల చిట్టానుపక్కనపెడితే కలిగే ప్రయోజనం సంతృప్తి దిగులు వదిలితే భయం వీడితే సంతృప్తి! అద్భుతాల ఆవిష్కరణకన్నా అంతరంతంగపు శుద్ది అసలైనసంతృప్తి! ఆశించని సుగుణం ఉన్నా సర్దుకునే అలవాటుఉన్నా సరిపోయే సంతృప్తి ! అనుభవించే అవకాశం కోసం నిరీక్షణ లేకుండా వర్తమానపు సంతోషాన్ని ఆస్వాదిస్తే అంతకు మించిన సంతృప్తి! ఉన్నచోటుని చేసే పనిని ఆరాధిస్తే సకలం సంతృప్తి! మనసు నిష్కల్మషంగా వుంచితే శ్రద్ధా, భక్తులతో నింపితే ఆనందాల సంతృప్తి! మానవ సహజమైన విషయాలే అయినా నిత్య…