తాగి తప్పు చేయకు
తాగి తప్పు చేయకు పల్లవి తాగకురన్నా తప్పు చేయకురన్నా "2వ" తాగిన మైకంలో తప్పులెన్నొచేస్తావు " 2వ" తాగకురన్నా తప్పు చేయకురన్నా "2వ"చరణం తాగి తాగి మత్తెక్కి తడబడుతూ ఉంటావు నడవలేక వణుకుతూ నేల పాకుతుంటావు నడిబజారులో పడుకొని నవ్వులపాలవుతావు చుట్టుమూగి జనమంతా "ఛీ"కొట్టుతుంటారు తాగకురన్నా తప్పు చేయకురన్నాచరణం ఆలివచ్చి ఏడ్చుకుంటు నిన్ను లేపజూస్తుంది ఇంటికొచ్చి బువ్వదిని గమ్ముగుండు మంటుంది డబ్బులిత్తె వత్తానని అక్కడె పడి ఉంటావు ఇంటికి పోదామంటు బ్రతిమిలాడుతుంటది తాగకురన్నా తప్పు చేయకురన్నాచరణం జాలిపడి సాయపడు జనమును తిడుతుంటావు మత్తుదిగి పోవాలని మంచినీళ్ళు చల్లుతుంది బుజ్జగించు భార్యను గని బుద్ధిలేక తిడతావు ఆసరిచ్చి లేపబోతె కసురుకుంటు ఉంటావు తాగకురన్నా తప్పు చేయకురన్నాచరణం డబ్బులకొరకింటికొచ్చి ఇల్లంతా వెతుకుతావు వండుకునే గిన్నెలను తీసుకొన జూస్తావు అడ్డగించు ఆలిని కొట్టి పట్టుకెళతావు అయ్య అవ్వ పేరు జెప్పి అప్పులెన్నొ జేస్తావు తాగకురన్నా తప్పు చేయకురన్నాచరణం ఏమీ తోచక పెండ్లము ఏడుస్తూ వుంటది తిండి…