telugu love poems

నీ కోసమే ఓ సఖీ

నీ కోసమే ఓ సఖీ గతించిన వసంతం మరలా‌ వస్తుందని.. పూలను రాల్చిన చెట్టు మరలా చిగురిస్తుందని.. పచ్చని చిలుక చెలిమి కోసం‌.. కొమ్మల మధ్యన నే వేచి ఉన్నా.. ఒంటరి గోరింకనై‌ ఇన్నేళ్లుగా.. నీ కోసమే ఓ సఖీ. ఎన్నటికీ రావని తెలియక.. ఇన్నాళ్లూ ఆశలు సజీవంగానే ఉన్నా.. ఇప్పుడెందుకో గుండెను ఏదో వేదన గుచ్చుతున్నట్టుంది.. స్వచ్ఛమైన నా మనసు నువ్విలా కష్టపెడుతుంటే తట్టుకోలేనంటోంది... నువ్ నాతో ఉన్నప్పుడు నీ ప్రేమను నిలపుకోలేకపోయా ఇప్పుడు నువ్ నాక్కాకుండా పోతుంటే ఆపలేకపోతున్నా.. ఈ శిక్షకు నన్ను నేనే నిందించుకోవడం తప్ప నిన్నేమనగలను. ఏళ్ల క్రితం ఇంకిపోయిన కన్నీరెందుకో రెప్పల మాటున దాగలేక మరలా ఉబికివస్తోంది.. ఇదే నిజమైన ప్రేమని ఆ ధారలు చెబుతున్నా.. వాటి మౌన ఘోష వినేందుకు నా సఖి సిద్ధంగా లేనంటే.. నే నేం చేయగలను. ఇది కవిత్వమో..లేక నా రచనా నైపుణ్యమో కాదురా.. ప్రతి అక్షరం మనసు…
Read More

అవని లో…. ఆమె

అవని లో.... ఆమె నా అవని అంతా....ఆమే నా అనుక్షణం.... ఆమే నా ఆద్యంతం....ఆమే నా ఆంతర్యం....ఆమే నా ఆలోచన... ఆమే నా వెలుగు....ఆమే నా భవిత.... ఆమే నా ఆశా... ఆమే నా శ్వాసా .... ఆమే నా అనుక్షణం... ఆమే నా ప్రతీ క్షణం... ఆమే.. నా మరో క్షణం... ఆమే.. నా బంగారం...ఆమే నా సింగారం...ఆమే నా అరవిరిసిన మందారం... ఆమే నా కలల ప్రపంచం అంతా ఆమె.. ఆమె.. ఆమె..ఆమె..ఆమే.. జగత్తు లోని మహిళా మణులందరికీ ఇవే నా హృదయ పూర్వక పాదాభివందనాలు.   - కిరీటి పుత్ర రాంబాబు రామకూరి
Read More