నీలి నీడలు కమ్ముకున్న వేళ
నీలి నీడలు కమ్ముకున్న వేళ "వెంటనే ఆపరేషన్ చేయాలి.. లేదంటే చాలా కష్టం.. ప్రాణానికే ప్రమాదం." డాక్టర్ చెప్పిన మాటలు విని సంతోష్ ఉలిక్కిపడ్డాడు.. తన చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా చీకటైపోయినట్టు కనిపించిందతనికి.. ఉన్నత చదువులు చదవాలని అతను కన్న కలలు.. విశ్వవిద్యాలయంలో చదవడం కోసం ర్యాంకు సంపాదించడానికి రేయింబవళ్లు పడిన కష్టం అంతా మర్చిపోవాల్సిందేనా.. అనారోగ్యానికి ఆశలను బలిచేయాల్సిందేనా.. "మనసుని అనేక ప్రశ్నలు దొలిచేస్తుంటే డాక్టర్ తో.."సర్, చాలా కష్టపడి చదివాను.. నాకంటూ ఓ లక్ష్యం పెట్టుకున్నాను.. ర్యాంకు కూడా వచ్చింది.. ఇప్పుడేమో ఏడాది పాటు చదువు మానేయాలంటున్నారు, అది నా వల్ల కాదు." అనగానే డాక్టర్ కి కోపమొచ్చింది.. నీకేమైనా అర్ధమవుతోందా.. వెళ్తే పోతావ్".. గట్టిగా మందలించారు.. అయినా సరే.. సంతోష్ మనసు మారలేదు. "యూనివర్శిటీలో జాయిన్ అయి, సెలవుపెట్టి వస్తాను.. అలాగైతేనే ఆపరేషన్ చేయించుకుంటా.. లేదంటే లేదు.. చదువు కంటే నాకు ప్రాణం ఎక్కువేం కాదు..…