tinku s

సినిమా ఒక్కటే మనుషులు వేరు

సినిమా ఒక్కటే మనుషులు వేరు నిద్ర రాక కొందరు సెకండ్ షో తో.. నిద్ర మానుకొని మరికొందరు అన్ని షోలతో.. అతి జాగత్ర తో అరగంట ముందు.. అతి నిర్లక్ష్యం తో పావు గంట తర్వాత.. ప్రవేశం..! శుభం కార్డు పడేదాకా కొందరు.. సగం మధ్యలో వెళ్ళేవాళ్ళు ఇంకొందరు..! గుట్కా, పాన్ పరాక్ ల బ్యాచ్.. పాప్ కాన్, కూల్డ్రింక్ ల తిండి బోతులు బ్యాచ్..! ఏమి జరిగినా కదలని బుద్ధ గ్రహాలు..అంకితం సీట్ కి.., అస్సలు కదలకుండా ఉండలేని చేప పిల్లలు...! విజిల్స్,పేపర్ కటింగ్, అరుపులు.. అదుపు ఉండదు వీళ్ళ ఆనందనికి....! నెల టికెట్ తో బాల్కనీ లోకి... గోడ దూకి సగం సినిమా దొంగచాటుగా ... ఒకటి టికెట్ పై రెండు సీట్స్..!, అడిగితే మా ఒళ్ళో ఉంటారు అనే సమాధానం... సైకిల్ స్టాండ్ అన్న మా బంధువు అని కొందరు... కరెంట్ పోయి బొమ్మ ఆగే.., హలోడి…
Read More

తల్లి మనసు

తల్లి మనసు ఈ క్షణం.. నా చూపు ఎవ్వరికి కానరాని ఆకుల చాటునా.... సూరన్న కొద్దికొద్ది కిరణాలు.. చంద్రన్న అంతా అద్దె వెన్నలు.. ఏటుచేసిన కోమ్మల చాటున ఆకాశమే.. వంగే.... విరగని... ముళ్ళు ఎరుగని... నోటికి అనువైనవి... బరువుకి తెలికైనవి... మెత్తని పుల్లలు... పొడువైన.. పాన్నపుకి సరియినా... ఎండి ఎండనివైన.. నూగు లేని పచ్చి వరి గడ్డి.... నిర్మాణానికి మా అమ్మ యిచ్చిన అనుభవం చాలు... సోగసులు అద్దడానికి నాలో ఉన్న పరిణితి చాలు... అది చాలని వేళ ప్రయత్నించే నా మనసు చాలు.. కట్టిన గూటిలో నా బుజ్జి పిల్లలు... ఒకదాని రంగు నాదే... మరొకదాని మొహం నాదే... ఎన్ని ఎలా వున్న అన్ని నా పిల్లలే.... ఆనందమో..,, సంతోషామో.., సంబరమో.., తెలియదు నాకు... నా రెక్కల మాటున దాగి..,ఈ ప్రపంచాన్ని..! అవి చూసే చూపులు... అమాయకపు అందాలు.. అవి చేసే శబ్దలు.. స్వచ్ఛమైన సంగీతం... అవి చేసే చేష్టలు..…
Read More

మనిషి ఉన్నతజీవి

మనిషి ఉన్నతజీవి "ఆనందం" అనే భావన తో....  చేప పిల్లలను నీటి తొట్టిలో బంధీస్తున్నాడు.... ! "నా వల్లే బ్రతుకుతున్నాయి"అనే భ్రమ తో...  స్వేచ్ఛ పక్షుల్ని పంజరాల్లొ బంధీస్తున్నారు... ! "ఇంటికి కాపలా"అనే పేరు తో...  విశ్వాసం గల కుక్కలని గొలుసులతో కట్టేస్తున్నారు..!  "భవిష్యత్" అనే భ్రమ తో..   పిల్లల బాల్యాన్ని బలి తీసుకుంటున్నారు...!  "సాంప్రదాయం" అనే సాకుతో..   ఆడవాళ్ళ అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్నారు..!  "విద్య" అనే మాయ తో...,   విద్యార్థులను వ్యథకు గురిచేస్తున్నారు... !  "జీతం"అనే పరువు కోసం..,   ఉద్యోగస్తుల్ని బానిసలుగా చేస్తున్నారు..!  "అభివృద్ధి" అనే  పేరుతో..,   ఉన్న పొలాలన్నీ ఫ్లాట్స్ గా మారుస్తున్నారు..! "మా మతం" గొప్పదనే అభిప్రాయం తో...,  జీవ హింసలు చేస్తున్నారు... !  "మానసిక ప్రశాంతత" అనే పేరుతో..,   మగవాళ్ళు మద్యం మత్తుకు అలవాటు పడుతున్నారు..!  "మాంసం" బలం అనే భ్రమతో...,   మూగజీవుల పై దాడులు జరుగుతున్నాయి..!  "రోగం"అనే పదాన్ని భూతంగా చూపిస్తూ...,   పేదల రక్తాన్ని…
Read More