ఉప్పొంగిన గోదారి
ఉప్పొంగిన గోదారి రాజమండ్రి దగ్గర లోని ఒక చిన్న పల్లె ఆ పల్లెలో పక్క పక్క ఇల్లే రాముడు, లక్ష్మి ది. చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగారు. వయసు పెరిగే కొద్దీ ఇద్దరి మధ్యా స్నేహం తో పాటు ప్రేమ కూడా పెరిగింది. అది ఇరు పెద్దలకు కూడా తెలిసింది. ఇరు కుటుంబాలు కూడా పెద్దగా ఉన్న వారు కూడా కాదు. వారి జీవనం ఒక్కటే గొదర్లో చేపలు పట్టడం అమ్ముకుని జీవనం సాగించేవారు. వారిద్దరి సంగతి ఇద్దరి కుటుంబాల వాళ్ళకి తెలిసింది కాబట్టి మంచి ముహూర్తాలు చూసి లగ్నాలు పెట్టించారు. ఇక లగ్నాలు పెట్టించాక ఆ ఇద్దరి ప్రేమికులకి అడ్డు అదుపు లేకుండా పోయింది. గోదారంతా వారిదే అయింది చెట్టు చేమా నీరు నిప్పు పంచభూతాలు వారి ప్రేమకు సాక్ష్యం అయ్యాయి. ఒకరినొకరు అల్లరి చేసుకుంటూ పట్టుకోవడానికి పరుగులు పెడుతూ గోదారి వెంట పరుగులు తీస్తూ అలుపు వచ్చేదాకా…