vamshi aksharalipi

ఓ బాటసారి

ఓ బాటసారి గమనం లేని ఓ గమ్యం కోసం గెలుపు బాటలు వెతుకుతూ ఓటమి అంచనా నిలబడి యుద్ధం చేసే ఓ బాటసారి నీకు నా వందనాలు. పరపతి పరువు ప్రతిష్టలు గురించి ఆలోచించకుండా నీకు నచ్చింది నీకు తోచింది చేస్తూ ఎవరి మాటలు పటించుకోకుండా నీవు అనుకున్నదే సత్యం నీవు నడిచే మార్గమే నీ నేస్తం అయింది. నీకు ఈ లోకంమే దాసోహం అనేలా నీ ప్రయాణాన్ని మార్చుకుని చివరికి విజయం సాధించి నీతో కాదు అనే పనిని నువ్వు చేసి చూపించావు అక్కడితో నువ్వు నీ ప్రయాణంలో చూసిన ప్రతి ఒక కష్టం ప్రతి ఒక పని నీ గెలుపుకి మార్గం లాగా చేసుకున్నావు. నిజంగా నీకూ నీ ప్రయత్నానికి జోహార్లు బాటసారి.. నీవే మాకు మార్గదర్శి... ఓ మా బాటసారి - వంశీ
Read More

పిల్లలు

పిల్లలు ప్రేమ, ఆప్యాయతలు, బంధం, భవిష్యత్తు గురించి వెతుక్కునే వయసులో బాధలని, బాధ్యతలని వెతుక్కుంటూ వాటి వెనక పరుగులు పెడుతూ ఎన్నో కష్టాలని, ఎన్నో బాధలని, భరిస్తున్నారు. చిరునవ్వులు చిందించవలసిన ముఖముల పైన కన్నీళ్లు చూస్తున్నాము. ధైర్యం చెప్పడానికి ఎవరూ లేకపోవడం ఒక కారణం అయితే పరిస్థితుల ప్రభావం మరొక కారణం. ఈ యొక్క బాలల దినోత్సవం నుండి అయినా అవి అన్నీ మారితే అదే సంతోషం... - వంశీ
Read More