vyarda pareeksha aksharalipi

వ్యర్ధ ప్రతీక్ష

వ్యర్ధ ప్రతీక్ష జగతి యావత్తూ.. ఒడలు మరచి... సమస్త వేదనలను విడిచి... నిదురమ్మ ఒడిలో.. స్వాంతన పొందుతున్న... ప్రతి రేతిరీ... గుండె చెలమల్లోంచి... ఉబికివస్తున్న... నీ గుర్తులను... ఆర్తిగా తడుముకుంటూ.. నీతో గడిపిన అందమైన జ్ఞాపకాలను.. ఆధరువుగా చేసుకుని.. నీతో కలిసి నడిచిన ఊసులనే.. ఊతంగా చేసుకొని... కన్నీళ్ళ కాసారంలో.. మునిగితేలుతూ.. నరకతుల్యమైన ఈ జీవితాన్ని నడిపిస్తూనే ఉన్నాను.. నీవు లేవని... ఇక రావనీ తెలిసినా ... బ్రహ్మరాతను తిరగరాస్తూ... బ్రహ్మాండాలను బద్దలు చేస్తూ... నా కోసం వస్తావేమోనని.. వ్యర్థ ప్రతీక్ష చేస్తూనే ఉంటుంది... నా వెర్రి మనసు.... కాసారం: కొలను ప్రతీక్ష: ఎదురుచూపు - మామిడాల శైలజ
Read More