ye kulam by arjun

ఏ కులం?

ఏ కులం? విలేఖరి : సార్ మీది ఏ కులం???? నేను : ఏ వయస్సు లో... విలేఖరి : అంటే వయస్సు బట్టి కులం వుంటుందా??? నేను : వుంటుంది బాల్యంలో బాలకులం యవ్వనంలో యువకులం వృద్ధాప్యంలో పండుటాకులం రాలిపోయే ఎండుటాకులం విలేఖరి : అది కాదు మామూలుగా మీది ఏ కులం??? నేను : ఎవరూ లేకుంటే ఏకాకులం ప్రేమలో వున్నప్పుడు ప్రేమికులం పెళ్లి అయ్యాక సంసారికులం కానప్పుడు బ్రహ్మచారికులం విలేఖరి : అది కాదండీ కమ్మ కాపు ఆలా మీది ఏ కులం నేను : ధనముంటే దనికులం లేకుంటే బీదకులం దేవుణ్ణి నమ్మితే ఆస్తికులం నమ్మకుంటే నాస్తికులం విలేఖరి : మీకు ఆసలు కులం లేదా???? నేను : ఎందుకు లేదు ప్రయాణిస్తే ప్రయాణికులం యాత్రలు చేస్తే యాత్రికులం మాయలు చేస్తే మాంత్రికులం ఉపన్యసిస్తే ఉపన్యాసకులం హాస్యం పండిస్తే విధూషకులం పాడితే గాయకులం సభలో ఉంటే…
Read More