ప్లాసిబో
ప్లాసిబో ప్రకృతికి దూరంగా జరుగుతూ కృత్రిమమైన జీవనశైలికి అలవాటుపడిన మానవుడు రకరకాల రోగాల బారిన పడుతూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా విషపూరితమైన రసాయనాలతో కూడినటువంటి ఔషధాలను ఉపయోగిస్తూ వందేళ్ళ జీవితాన్ని క్రమక్రమంగా కుంచింపచేసుకుంటున్నాడు. పంచభూతాల సమాహారమైన ఈ దేహంలో తలెత్తిన సమస్యలకు వీలైనంతవరకూ ప్రకృతిపరంగానే పరిష్కరించుకోవడం మేలు.. మూడు దశాబ్దాల కిందట జరిగిన ఓ యదార్థ సంఘటన గురించి ఈ సందర్భంగా చెప్పుకోవడం సముచితం. అమెరికాలోని ఓహయోలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఒక మహిళ క్యాన్సర్ కి చికిత్స తీసుకుంటోంది. ఎన్ని రకాల డ్రగ్స్, అల్ట్రా చికిత్సలు ప్రయోగించినా ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. ఆమెకు చివరి ఘడియలు సమీపించినట్లేనని డాక్టర్లు నిర్ధారించారు.. ఇంతలో డాక్టర్ల బృందంలోని ఓ యువ డాక్టర్ కు ఒక ఐడియా వచ్చింది. దానిని మిగతా డాక్టర్లందరితో చర్చించి అందరి ఆమోదం పొందాక ఆ క్యాన్సర్ పేషెంట్ ని పిలిపించారు. "అమ్మా.. మీరు అర్థం చేసుకోగలరు అనే…