Month: December 2025

జాతీయ రైతు దినోత్సవం

జాతీయ రైతు దినోత్సవం

జాతీయ రైతు దినోత్సవం జాతీయ రైతు దినోత్సవం డిసెంబరు 23 న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు. భారతదేశ 5వ ప్రధానమంత్రి, 'భారతదేశపు రైతుల విజేత' గా గుర్తింపుపొందిన చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. చౌదరి చరణ్ సింగ్ చేసిన అనేక ఉద్యమాల వల్ల జమీందారీ చట్టం రద్దై, కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది. రైతులకు బ్యాంక్ ఋణాలు అందించే విధానము ప్రవేశపెట్టబడింది. రైతుల గురించి, వ్యవసాయరంగం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి కృషిచేసిన చరణ్ సింగ్ సేవలకు గుర్తుగా ప్రభుత్వము చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది. రైతు దినోత్సవం సందర్భంగా వ్యవసాయరంగంపై చర్చలు, సదస్సులు, క్విజ్ పోటీలు, శిక్షణా శిబిరాలు, ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. చరణ్ సింగ్ మూడవ వర్థంతి (1990, మే 29) సందర్భంగా భారత ప్రభుత్వం చరణ్ సింగ్ చిత్రంతో…
Read More
డిసెంబర్ 23 ప్రత్యేకతలు

డిసెంబర్ 23 ప్రత్యేకతలు

డిసెంబర్ 23 ప్రత్యేకతలు :⁠- ✒ 1841: కలకత్తాలోని హిందూ కళాశాల నియమిత అధ్యాపకుడు, పండితుడు, కవి హెన్రీ డెరోజియో మరణం (జ.1809). ✒1902: భారతదేశ ఐదవ ప్రధానమంత్రి చరణ్ సింగ్ జననం (మ.1987). ✒1926: భారత విద్యావేత్త స్వామి శ్రద్ధానంద మరణం (జ. 1856). ✒1933: కవి, సంపాదకుడు శిరోమణి సహవాసి జననం (మ. 2007). ✒1987: వీణ విద్వాంసుడు ఈమని శంకరశాస్త్రి మరణం (జ.1922). ✒1997: పండితులు గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి మరణం (జ.1913). ✒1998: లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ కు మరణానంతరం భారతరత్న పురస్కారం లభించింది. ✒2004: భారతదేశ 9వ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు మరణం (జ.1921). మాధవి కాళ్ల
Read More
జాబిలి

జాబిలి

కన్నుల నిండా నీవే, కలల్లో నీవే, కనులెత్తి ఆ జాబిలిని చూస్తే నీ మోము నిండు చంద్ర లేఖలు రూవ్వే వెన్నెల పూవులు, విస్తుపోతూ కళ్ళు మూసుకున్నాను, ఆ అంధకారంలో వెలుగు దివ్వె నీ రూపం, నన్ను వెర్రివాన్ని చేస్తోంది, నా రోజువారి వ్యాపకాలు చేసుకోనీయకుండా,,,,, ఈ అక్షరాలు వర్ణించలేనంతగా హృదయాన్ని అల్లుకుపోయావు,,,,,తుఫాను రేయి జాబిలిలా,,,,,!! అపరాజిత్
Read More
సీ!!🚩🚩🚩

సీ!!🚩🚩🚩

సీ!!🚩🚩🚩 గోదారి యేరులై రాదారి వెంటనురక్తమ్ము బారెను రాజ్యమెల్ల!హిందుబంధువు లెల్ల హింసను భరియించినోరు తెరవరైరి యుర్విలోన!నేపాలు చూడండి పాపాలు కడుగంగబ్రహ్మపుత్రుల వలె బాటబట్టె!యిజ్రాయిలు ప్రజలు వజ్ర కవచులయ్యిభారత్కు మద్దతు పలుకుచుండ్రి!! ఆ!!వె!!🚩🚩🚩 బంగ్లదేశమందు బందూకు లెత్తిరిపరమతముల వారి పట్టిచంప!బానిసత్వమునిక భారత పౌరులుమానవలయు కృష్ణ మరువబోకు!! గడ్డం కృష్ణారెడ్డి
Read More
చెదిరిన జీవితాలు,,,,,,!

చెదిరిన జీవితాలు,,,,,,!

చెదిరిన జీవితాలు,,,,,,! భారావహ పేదరికంలో పుట్టిఎన్నెన్నో కష్టాలుపడి చదివిన ఉన్నత చదువులుఏ ఉద్యోగాలు రాక పెను గాయాలై వేధిస్తుంటేతల్లిదండ్రులు ఉన్న రెండు ఎకరాల భూమి అమ్మివిదేశీ గడ్డపై కాలిడిన ఆడపిల్లలుప్రయివేటు ఉద్యోగాల పేరుతోసాఫ్ట్ వేర్ కంపెనీలు ఇచ్చే వేల డాలర్ల మోజులోఒళ్ళంతా మేకప్పులు వేసుకునిరంగు రంగుల దుస్తుల్లోరంగు కళ్ళజోడులో రంగు రంగుల ప్రపంచంఅదే పనిగా కంప్యూటర్లను టిక్కు టిక్కు మంటూ వత్తుకుంటూవిజ్ఞానమంతా కంప్యూటర్లలోనే నిక్షిప్తమైన కృత్రిమత్వంఏ ఆనందమూ తీరిక లేని రంగు వెలిసిన జీవితాలుబిజీ బిజీగా మారుతున్న ప్రాపంచిక జీవితాలురంగు రంగుల నియాన్ కాంతుల్లో కలగాపులగం కలల ఊహలుఅక్కడి వేల డాలర్లు ఇక్కడ లక్షల రూపాయలునిరుపేద తల్లిదండ్రుల ఆనందమే ఆనందంరోజంతా కష్టపడి కళ్ళు బైర్లుకమ్మినడుములు చేతులు పీకుతుంటేఆడ మగా తేడాలేకుండా సిగరెట్లు మందుకు మాదకద్రవ్యాలకు బానిసలైవిదేశీ గడ్డపై జీవితాలు వెల కట్టబడే చెదిరిపోయిన రంగు కాగితాలు డాలర్లుఇంద్రధనస్సు రంగుల నియాన్ వెలుగుల్లోజీవితంలో ఏదో కోల్పోతున్న వెలితినిర్లజ్జగా తిరుగుతున్న ఆడమగ విదేశీ సంస్కృతిలో…
Read More
శ్రీనివాస రామానుజన్ వారసత్వం

శ్రీనివాస రామానుజన్ వారసత్వం

శ్రీనివాస రామానుజన్ వారసత్వం శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ (డిసెంబర్ 22, 1887 - ఏప్రిల్ 26, 1920) 20వ శతాబ్దం ప్రారంభంలో పనిచేసిన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు. స్వచ్ఛమైన గణితంలో దాదాపుగా అధికారిక శిక్షణ లేనప్పటికీ, ఆయన గణిత విశ్లేషణ , సంఖ్యా సిద్ధాంతం , అనంత శ్రేణి మరియు నిరంతర భిన్నాలకు గణనీయమైన కృషి చేశారు , అప్పట్లో పరిష్కరించలేనివిగా పరిగణించబడే గణిత సమస్యలకు పరిష్కారాలు కూడా ఉన్నాయి. రామానుజన్ ప్రారంభంలో తన సొంత గణిత పరిశోధనను ఒంటరిగా అభివృద్ధి చేసుకున్నాడు. హన్స్ ఐసెంక్ ప్రకారం , "అతను తన పనిలో ప్రముఖ ప్రొఫెషనల్ గణిత శాస్త్రవేత్తలను ఆసక్తి చూపడానికి ప్రయత్నించాడు, కానీ చాలా వరకు విఫలమయ్యాడు. అతను వారికి చూపించాల్సినది చాలా నవల, చాలా తెలియనిది మరియు అదనంగా అసాధారణ మార్గాల్లో ప్రదర్శించబడింది; వారు బాధపడలేరు." తన పనిని బాగా అర్థం చేసుకోగల గణిత శాస్త్రవేత్తలను వెతుకుతూ, 1913లో…
Read More
జాతీయ గణిత దినోత్సవం

జాతీయ గణిత దినోత్సవం

జాతీయ గణిత దినోత్సవం జాతీయ గణిత దినోత్సవం డిసెంబరు 22న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు. 2012 ఫిబ్రవరి 26న మద్రాస్ విశ్వవిద్యాలయంలో జరిగిన రామానుజన్ 125వ జయంతి ప్రారంభ వేడుకల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. డిసెంబరు 22న దేశవ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలలో విద్యా కార్యక్రమాలతో జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటారు. సంఖ్యాశాస్త్రంలో రామానుజన్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో రామానుజన్ 75వ జన్మదినం నాడు స్మారక తపాలా బిళ్ళను విడుదల చేయడమేకాకుండా 125వ జయంతి సందర్భంగా 2012ను జాతీయ గణితశాస్త్ర సంవత్సరంగా ప్రకటించింది. 2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా లోని కుప్పంలో రామానుజన్ మఠ్ పార్క్ ప్రారంభించబడింది. గణితం అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది. గణిత శాస్త్రం…
Read More
డిసెంబర్ 22 ప్రత్యేకతలు

డిసెంబర్ 22 ప్రత్యేకతలు

డిసెంబర్ 22 ప్రత్యేకతలు :⁠- ✒ సంవత్సరంలో అతితక్కువ పగటి సమయం ఉండే రోజు (Winter Solstice). ఐతే, ఇది ఉత్తరార్ధగోళానికి మాత్రమే పరిమితం. దక్షిణార్ధ గోళంలొ ఇది జూన్ నెలలో సంభవిస్తుంది. మరో విషయం ఏమంటే, ఈరోజు కొన్ని సంవత్సరాలలో డిసెంబరు 21న లేదా 22న కూడా కావచ్చును.భారతదేశంలో జాతీయ గణిత దినోత్సవం. ✒1666: సిక్కుమత పదవ గురువు గురు గోవింద సింగ్ జననం (మ.1708). ✒1853: ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస భార్య,యోగిని, శారదా మాతగా ప్రసిద్ధిచెందిన శారదా దేవి జననం (మ.1920). ✒1887: గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జననం (మ.1920). ✒1899: వైద్యశాస్త్ర ప్రముఖుడు శొంఠి దక్షిణామూర్తి జననం (మ.1975).డిసెంబర్ 22 ప్రత్యేకతలు :⁠- ✒1932: భారత దేశానికి చెందిన ఆర్థిక వేత్త, రిజర్వ్ బ్యాంకు గవర్నరుగా పనిచేసిన సి.రంగరాజన్ జననం. ✒1947: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు దిలీప్ దోషి జననం (మ.2025).…
Read More
అగ్నికీలల్లో నరమేథం

అగ్నికీలల్లో నరమేథం

అగ్నికీలల్లో నరమేథం పర్వతం లోలోపల శిలలు కుతకుత లాడే అగ్నికి ఉడికి ద్రవించి దఢేల్మని పేలే అగ్నిపర్వతం అగ్నికూపం,,,,,,,,,రంగు రంగుల అగ్నికీలల్లో లావా ఎగజిమ్ముతూ దిక్కులు పిక్కటిల్లే శబ్దంతో ఉగ్రనృసింహమై విరుచుకుపడుతూ,,,,,,,,,,ఈ మానవుని టెక్నాలజీ, సైన్స్ ఏదీకూడా నిరోధించలేని,ఛేదించలేని జనజీవితాల గుండెల్లో గుబులు రేపుతూ మానవున్ని నిట్టనిలువునా కూల్చేసే లావా అగ్నిద్రవం విస్తరించినంత మేరా నామరూపాలు లేకుండా జనప్రాణ నష్టం వాటిల్లే క్షణాలు బహుగంభీరం,,,,,,,,,,జనులు, జంతుజాలముల ఆర్తనాదాలలో మారణహోమం హృదయ విదారక కఠినమైన దృష్టాంతం,,,,,,,,,,,,ఆ దావాణలంలో ఉక్కిరిబిక్కిరి చేస్తూ దట్టమైన అతివేడి పొగ గాలులు ,అగ్నిమంటలు విరజిమ్ముతూ మానవున్ని తుదముట్టించడమే లక్ష్యంగా కూలిపడుతున్న దట్టమైన అగ్గిపొగ మేఘాలు,,,,,,,,,,,మనిషి తన జీవన పోరాటంలో శాస్త్ర ప్రయోగాలు చేసి ఎన్నెన్నో కనిపెట్టినా ప్రకృతి వైపరీత్యాలకు తలవంచక తప్పట్లేదు,,,,,,,,,,,,ఈ జీవన్మరణ పరిస్థితుల్లో నైనా మన చుట్టూర వున్న చెట్టుచేమలను జంతుజాలములను రక్షించుకుందాం రక్షణపొందుదాం,,,,,,,,,,,, అపరాజిత్సూర్యాపేట
Read More
ఆ!!వె!!🌺🌺🌺

ఆ!!వె!!🌺🌺🌺

పూజగదిని గట్టు పూజించ దైవాన్నిభార్యబిడ్డలకును పడకగదిని!తల్లిదండ్రి గదిని తానెట్ల మరిచెనో!తెలుసుకోర కృష్ణ తెలివితోడ!! గడ్డం కృష్ణారెడ్డి!రేపాల!సూర్యాపేట
Read More