Month: February 2026

జువ్వాడి గౌతమరావు (భాషాభిమాని, సాహితీకారుడు)

జువ్వాడి గౌతమరావు (భాషాభిమాని, సాహితీకారుడు)

జువ్వాడి గౌతమరావు (భాషాభిమాని, సాహితీకారుడు) జువ్వాడి గౌతమరావు (ఫిబ్రవరి 1, 1929 - 2012) భాషాభిమాని, సాహితీకారుడు.కరీంనగర్ మండలం ఇరుకుళ్ళ గ్రామంలో 1929, ఫిబ్రవరి 1 న జువ్వాడి గౌతమరావు జన్మించాడు. కరీంనగర్‌లో విద్యాభ్యాసం సాగించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ ఎల్‌ఎల్‌బీ పట్టా పుచ్చుకున్నాడు. అతనుకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పీవీ నరసింహారావు, కోవెల సుప్రసన్నాచార్య, కోవెల సంపత్కుమారాచార్య వంటి సాహితీ మిత్రులతో అతనుకు చాలా సాన్నిహిత్యం ఉంది. కరీంనగర్ సాహిత్య చైతన్య కేంద్రంగా భాసిల్లడంలో గౌతంరావు పాత్ర ఘననీయమైనది. వరంగల్‌లో కాళోజీ, ఆదిలాబాదులో సామల సదాశివ మాదిరిగా కరీంనగర్‌లో జువ్వాడి గౌతంరావు సాహితీ వటవృక్షంగా వేలాదిమంది సాహితీకారులకు ఆశ్రయమిచ్చాడు. ఔరంగాబాద్ జైలు గోడలను ఛేదించుకొని వచ్చిన ధైర్యశాలి. కరీంనగర్‌లో తెనుగు ఉనికిని కాపాడుతూ, అనేక కవితా గోష్ఠులలో పాల్గొంటూ నిరంతర సాహిత్య సేవ చేసిన భాషాభిమాని జువ్వాడి. ఆధునిక కాలంలో అడుగంటి పోతున్న సంప్రదాయ కవితా…
Read More
ఈ అక్షరాలు అగ్నిపునీతలు

ఈ అక్షరాలు అగ్నిపునీతలు

ఈ అక్షరాలు అగ్నిపునీతలు ఈ ఎర్రని ఆకాశం రక్తం గోడల మధ్య బంధీనైఈ చీకటి కన్నీళ్ల ఎద అద్దంలో నేనునాకై నేను రాజులా తారనైరగిలే ఎద కుంపటి కటి అంగం కామాగ్నిలోఅగ్నికూపం అక్షరాలు బలి తీసుకునే చీకటి ఆలోచనలునాకై నేనే బలియవుతూ తూరుపు బొట్టుకు కాలివేలెత్తి చూపుతూనగ్నపిశాచాలు కళ్ళల్లో తిరుగుతూచీకటి ఆలోచనలు తలంటు స్నానం చేస్తూనా మనస్సు ఊబిలోకి జననాంగాన్ని జోప్పిస్తూనాలో నేను ఐక్యమవుతూ ఆ ఇరువురు నేనైరాముని అగ్నిపునీత సీత నేనొక్కడినైఆర్పేయలేని మంటల్లో ఆహుతవుతూనింగినిండా చుక్కలలో గోడల మధ్య శృంగారంనేనొక్కడినే అడవిలోని రేలపూవుల సారా మనస్సు నిండా తాగుతూ మత్తుగా,,,,,,,ఉరికొయ్యను పట్టుకుని ఊగుతూ కళ్ళు బైర్లుకమ్ముతూ గోడల మధ్య స్మశానం ప్రేమల శృంగారం జీవితం,,,,,,తరువాయి తీరిగ్గా భగవద్గీత చప్పరిస్తూ చాయి తాగుతూఅందాల లోకంలో పూవులు జలపాతంలో కొట్టుకుపోతూవన్నెచిన్నెల కలల చిన్నది కళారూపం చిత్రీకరిస్తూనా చెరసాల నిండా అక్షరాలు అగ్నిరాతలు ఆగిపోయే ఆఖరి ఆలోచనలునన్ను నేను గోముగా తల నిమురుకుంటూ ఆగిపోయిన…
Read More
ఆలోచనల అక్షరాలు

ఆలోచనల అక్షరాలు

ఆలోచనల అక్షరాలు కళ్ళు కలలుగన్న దృశ్యం ఏటి అలలపై కొట్టుకుపోతూమనస్సులో ఆలోచనలు తోడినా కొలది ఊరుతూమనస్సు నిండా పొగమంచు సాలోచనలు ఎగిసి ఎగిసిపడతూఅడవిని మింగిన ఆలోచనల మనస్సును అడ్డంగా నరికేస్తూఊరు ఉరుముతోంది ఆలోచనల కారుమబ్బులు అగ్ని కురుస్తోంటేపగిలిన ఇసుక మేటలు మంటల్లో ఎడారి ఆలోచనలు ఎండమావులు,,,,,దుఃఖం మింగిన చిక్కని రేయి కొవ్వొత్తి వెలుగులో ఆలోచనలు ముసురుకొస్తున్న మూగరోదన,,,,,,అక్షరాలు రక్తసిక్తమైన అలజడిలో ఆలోచనలు లిఖించలేని అగ్నిపూవులునిండుగా ప్రవహిస్తున్న రక్తంతో ఏరు ఆలోచనలను తోసుకొస్తోందిచింత నిప్పుల్లో పులి కళ్ళు తెరుచుకున్న ఆలోచనలు క్రూరంగా రూపుమాపుతూ విరుచుకుపడుతూఆగిఆగి కురుస్తున్న ఆలోచనలు వర్షంలో సుకుమారులు మానవత్వం అక్షరాలు పేరుస్తున్నాయి కలం నిండా,,,,,,లక్షల జీవితాల అంగడిలో ఆలోచనల గుండెల్లో మానవత్వం తెరిపిస్తూ అక్షరాలను వేలం వేస్తూ ఉచితంగా పంచినా ఉలుకూపలుకూ లేదు,,,,,,మందులో విందుచేసుకునే మాంసంలా జనానికి అక్షరాలు అమృతమయ ఆలోచనలు పట్టి గొంతులో పోసినా దిగవు,,,,,,,ఈ శ్రమల చింతనల ఆలోచనలు నీకేల,,,!? అపరాజిత్
Read More