ఆమె
ఆమె సహనానికి నిలువుటద్దం
ఓపికకు మారుపేరు ఆమె
ఆమె విలువలు నేర్పుతుంది
ఆమె సంస్కారం నేర్పిస్తుంది
ఎలా ఉండాలో నేర్పుతుంది
ఎలా మాట్లాడాలో తెలుపుతుంది
ఎలా ఉండకూడదో నేర్పిస్తుంది
ఎక్కడ నవ్వులపాలు కాకూడదో తెలుపుతుంది
ఎలా ధైర్యం గా ఉండాలో నేర్పుతుంది
ఎలా బెలగా ఉండకూడదు తెలుపుతుంది
ఆమె ప్రశ్నించడం నేర్పుతుంది
ఏమైనా తట్టుకునే శక్తిని ఇస్తుంది
ఎలా మాట్లాడకూడదో నేర్పుతుంది
ఎలా పొదుపుగా ఉండాలో తెలుపుతుంది
ఎలా ఖర్చులు చేయకూడదో నేర్పుతుంది
ఇంటిని ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలుపుతుంది
ఇంటికి పెద్దగా ఎలా ఉండాలో నేర్పిస్తుంది
ఎవరితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది
ఎలా ఉండకూడదో తెలుపుతుంది
ఎలా సహాయం చేయాలో, చేయకూడదో నేర్పిస్తుంది
ఇన్ని నేర్పిన ఆమె….
మాత్రం మమకారానికి లొంగిపోతుంది
మాటలకు కరిగిపోతుంది
ప్రేమ, ఆప్యాయతానురాగాలను పంచుతుంది
బంధాలను తెగిపోకుండా కాపాడుతుంది
చివరికి ఆమె ఆ బంధాల నడుమ చిక్కిపోతుంది
అంతా నావారే అనుకున్న ఆమె
బాధ్యతకు లొంగిపోతుంది
తాను నేర్పిన బాటే ముళ్ల కంపగా మారి
తననే చిల్చుతూ ఉన్నా…..
కరిగిపోతూ, కాలిపోతుంది
ఆమె అమ్మ… మనందరి తల్లి
ప్రతి అమ్మ కథే ఇది, ఇంతే ఆమె జీవితం
ఆమె లేనిదీ నువ్వు లేవు, నేను లేను
సృష్టిలో తియ్యనిది, మాయనిది
మోసం, ద్వేషం, స్వార్థం, కల్లాకపటం లేనిదీ
అమ్మప్రేమ ఒక్కటే ఆమె ఏడిస్తే భూకంపమే
ఆమె ఉరిమి చూస్తే ప్రళయమే
ఆమె కోపం నీకు, నాకు విధ్వంసమే
ఆమె లేనినాడు నీకు విలువే లేదు
ఆమె ధరణి అయినా, తల్లి అయినా
ఆమె గర్జిస్తే నీకు నూకలు చెల్లినట్టే
ఆమె.. ఆమె… ఆమె… ఆమె… అమ్మా
– భవ్యచారు