శ్రీ రాముడు ఎందుకు గొప్పవాడు?
శ్రీ రాముడు ఎందుకు గొప్పవాడు? మాయలు మంత్రాలు చూపించలేదు. #విశ్వరూపం ప్రకటించలేదు. *జీవితంలో ఎన్నో కష్టాలు...* *జరగరాని సంఘటనలు...* *చిన్న వయసులోనే పినతల్లి స్వార్థానికి తండ్రిని పోగొట్టుకున్నాడు...* *పట్టాభిషేక ముహూర్తానికే అడవుల బాట పట్టాడు...* *తోడుగా, ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు...* *కారడవుల్లో కన్నీళ్లతో వెతికాడు...* *అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే రాక్షస వధ చేశాడు...* *అందరిలాగే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు.* *లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా తాను మాత్రం విస్పష్టంగా అహం దశరథాత్మజః - దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే’ అని ప్రకటించాడు…* *అయినా లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంది?* *ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు. ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ.. ధర్మాన్ని విడిచిపెట్టలేదు.…