అన్వేషణ ఎపిసోడ్ 2
అన్వేషణ ఎపిసోడ్ 2 ఒకపక్క మొదటి జరిగిన హత్య కేసు కోర్టులో విచారణలో వుండగానే, వరుసగా జరుగుతున్న ఈ హత్యలు నివారించడం పోలీసు వారి వల్ల కాకపోవడం, ప్రజా వ్యతిరేకత కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఈ హత్య కేసులన్నీ చేధించడానికి కోర్టు, చివరికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ని నియమించింది. ఆరుగురు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ బృందానికి సారథ్యం వహిస్తున్నాయన పేరు ఏసిపి రంజిత్ కుమార్. కేసుని టేక్అప్ తీసుకున్న అతి కొద్ది సమయంలోనే ఏసిపి రంజిత్ కుమార్ సారథ్యంలో గల ఆ సీఐడీ టీమ్ ముమ్మరైన దర్యాప్తు చేపట్టింది. కేసులను మరింత లోతుగా విశ్లేషిస్తూ ఆ హంతకుడిని పట్టుకోవడానికి ప్రణాలికలు రచించడంలో నిమగ్నమైంది ఆ బృందం. మరొక ప్రక్క ఆ మూడు హత్య కేసులలో దొరికిన ఒకే ఒక్క క్లూ (సత్య అని రాసున్న కాగితం)ని కూడా ఆ సీఐడీ వాళ్ళు నమ్మలేక పోయారు. కారణం, హంతకుడు ఆ…