Trending Now

కుష్వంత్ సింగ్

కుష్వంత్ సింగ్

కుష్వంత్ సింగ్ కుష్వంత్ సింగ్ (ఫిబ్రవరి 2 1915 – మార్చి 20 2014) భారతీయ రచయిత, న్యాయవాది, రాజకీయవేత్త, జర్నలిస్టు.ఇండో-ఆగ్లియన్ రచయితగా కుష్వంత్ సింగ్ విశిష్ట లౌకిక వాదిగా సుపరిచితులు. దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు జరుగుతున్న సమయంలో వాటి నుంచి తప్పించుకునేందుకు భారతీయ వీఐపీలకు పోలీసులు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు సూచించారు. కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని చెప్పారు. సిక్కుల చరిత్ర, సాహిత్యం లాంటి అనేక అంశాలపై అద్భుతమైన రచనలు చేసిన కుష్వంత్ సింగ్, సునిశితమైన హాస్యానికి పెట్టింది పేరు. తన హాస్యం, కవిత్వం పై ప్రేమ మూలంగా ఆయన యోగన పత్రికకు సంపాదకులుగానూ, "ది ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా", "ద నేషనల్ హెరాల్డ్",, "హిందూస్థాన్ టైమ్స్" లకు సంపాదకత్వం వహించారు. కుష్వంత్ సింగ్ పంజాబ్‌లో స్వర్ణ దేవాలయంనుంచి తిరుగుబాటుకు నాయకత్వం వహించిన జర్నేల్ సింగ్ భిందర్‌వాలేను తన రచనలతో నేరుగా ఢీకొన్నప్పటికీ 1984లో ఆపరేషన్…
Read More
కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి

కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి

కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి (1863 ఫిబ్రవరి 2 - 1940 అక్టోబరు 29) తెలుగు రచయిత, పాత్రికేయుడు. తెలంగాణ్యబ్రాహ్మణులు. గౌతమసగోత్రులు, ఆపస్తంబసూత్రులు. వీరి తండ్రి: బ్రహ్మావధాని, తల్లి: సుబ్బమ్మ. వీరు తూర్పు గోదావరి మండలం లోని పలివెల గ్రామంలో ఫిబ్రవరి 2, 1863లో జన్మించారు. ఎక్కువకాలం కాకినాడలో గడిపారు. 1883 లో బ్రహ్మయ్య శాస్త్రి గారు ‘’ఆర్యమతబోధిని‘’ అనే సభను స్థాపించి కాకినాడలో ప్రసిద్ధ వ్యక్తులైనారు. కృత్తివెంటి పేర్రాజు, నాళం పద్మనాభం మొదలైన పెద్దలు శాస్త్రి గారి మతాభిమానానికి కార్యదీక్షకు మెచ్చి చేయూతనిచ్చారు. ఈ సభకు అనుబంధంగా ‘’వివేకానంద పుస్తక భాండాగారం‘’ అనే గ్రంథాలయన్నీ స్థాపించారు. మొదట్లో జగన్నాధపురం లో ఉన్న ఈ లైబ్రరీని ఆ తర్వాతి కాలంలో పెద్దవీధిలో ఉన్న ‘’పురం వారి సత్రం’’ లోకి మార్చారు. కుర్చీలు బల్లలు సేకరించి ఉపయోగించారు. సుమారు 15 వార్తాపత్రికలను తెప్పించేవారు. ఇక్కడే శాస్త్రిగారు హిందూమతం పై గొప్ప ఉపన్యాసాలిచ్చేవారు. ప్రసిద్ధులను…
Read More
జీవితం చెరల సాలోచనలు

జీవితం చెరల సాలోచనలు

జీవితం చెరల సాలోచనలు ఎగదన్నుకొస్తున్న సుదీర్ఘమైన ఆలోచనలుఅలసిపోయిన జీవితం ఆఖరు పోరాటం దాకానును వెచ్చని కౌగిలిలో నాలో నేను ముడుచుకుంటూపొగలు చిమ్ముతూ ఆలోచనలు నన్ను ఎగాదిగా చూస్తూవయస్సు ముదిరిన యవ్వనం మనస్సు లోయల్లోకి తొంగిచూస్తూ బావురుమంటూ,,,,,,ఆలోచనల వయస్సు పెరుగుతూ మనస్సు ముడుచుకుపోతూ ఏది శాశ్వతం చివరకు,,,,,,అనుభవాల సంద్రంలో ఆలోచనలు చెరల కెరటాలు ఎగిసిఎగిసి అలసిసొలసి ఆగిపోతున్న అలజడులు జీవితం పొరలు,,,,,,నింగిదాకా నిలువెత్తు గాయాలు జాలిగా కన్నీళ్లు దిగమింగుకుని ఓదార్చుకుంటూ నిద్రిస్తున్నాయి,,,,,,కల్లలైన కలలు నిప్పుల సెగలు కాలం గుండెల్లో కన్నీళ్లు ఒలికి ఆరిపోతూ ఆగిపోయేదెప్పుడో,,,,,,,నడివయస్సు నట్టేటిపై పడవకు రంధ్రం చూడక మునిగిపోతూ అనుభవాల గుణపాఠంతో అప్రమత్తమయినా తీరం చేరుకుంటానా,,,, ఏమో !!ఆశలు అడియాశలైన జీవితం కొట్టుకుపోతూ ఈ అరవైలో రోగాల రొంపి మాత్రలు ముల్లెలైన వైద్యుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ జీవితం కొనసాగింపులో జవాబీదారుని నేనే,,,,,,,కోరలు తెరుచుకున్న చరవాణిపై అక్షరాలు నింపుకున్న వేలుతో సున్నితంగా మీటుతూ జీవితం చెరల దృశ్యాలను అక్షరీకరిస్తున్నా నీ…
Read More
నీ ప్రేమతో నిండిన హృదయం

నీ ప్రేమతో నిండిన హృదయం

నీ ప్రేమతో నిండిన హృదయం నా ప్రియమైనవాడా…! నా హృదయం మళ్లీ నీ జ్ఞాపకాలతో నిండిపోతుంది. సాయంకాలపు నారింజ రంగు ఆకాశం, దూరంగా నిలిచిన చెట్టు, నిశ్శబ్దంగా ఒదిగిపోయిన ఇద్దరి రూపాలు , అన్నీ కలసి మన ప్రేమకథను చెప్పుతున్నట్టుగా అనిపిస్తోంది. ఈ దృశ్యంలో కనిపించే ఆ ఇద్దరూ మనమేనేమో అని ఒక్క క్షణం అనిపించింది. కాలం ఆగిపోయి, ప్రపంచం మన చుట్టూ మాయమైపోయినట్టు ఉంది. నిన్ను తొలిసారి చూసిన రోజు ఇంకా గుర్తుంది. అప్పటి నుంచి నా జీవితానికి ఒక అర్థం వచ్చింది. నీ నవ్వు నా ఉదయాన్ని వెలిగించింది, నీ మాట నా మనసుకు ధైర్యం ఇచ్చింది.ఆకాశంలా నా హృదయం కూడా నీ ప్రేమతో రంగులద్దుకుంది. నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు నాకు భయం తెలియదు, ఒంటరితనం తెలియదు. నీ కౌగిలిలో ఉంటే ఈ లోకంలోని బాధలన్నీ దూరమైపోతాయి. ఒకరినొకరు హత్తుకున్న విధానం చూస్తుంటే మన మధ్య ఉన్న అనుబంధం…
Read More
విస్లావా సింబోర్స్‌కా (కవయిత్రి, అనువాదకురాలు. నోబెల్ బహుమతి గ్రహీత)

విస్లావా సింబోర్స్‌కా (కవయిత్రి, అనువాదకురాలు. నోబెల్ బహుమతి గ్రహీత)

విస్లావా సింబోర్స్‌కా (కవయిత్రి, అనువాదకురాలు. నోబెల్ బహుమతి గ్రహీత) మరియా విస్లావా అన్నా స్జింబోర్స్కా(2 జూలై 1923 – 1 ఫిబ్రవరి 2012) ఒక పోలిష్ కవయిత్రి, వ్యాసకర్త, అనువాదకురాలు మరియు 1996 సాహిత్య నోబెల్ బహుమతి గ్రహీత. ప్రోవెంట్ (ఇప్పుడు పశ్చిమ-మధ్య పోలాండ్‌లోని కోర్నిక్‌లో భాగం )లో జన్మించిన ఆమె తన జీవితాంతం వరకు క్రాకోవ్‌లో నివసించింది. పోలాండ్‌లో, స్జింబోర్స్కా పుస్తకాలు ప్రముఖ గద్య రచయితలతో పోటీ పడుతూ అమ్మకాలను చేరుకున్నాయి, అయినప్పటికీ ఆమె "సమ్ లైక్ పోయెట్రీ" ("నీక్టోర్జీ లుబియా పోయెజ్జె") అనే కవితను రాసింది, అది "బహుశా" వెయ్యి మందిలో ఇద్దరు కవిత్వాన్ని ఇష్టపడతారు. "మానవ వాస్తవికత యొక్క శకలాలుగా చారిత్రక మరియు జీవ సందర్భాన్ని వెలుగులోకి తీసుకురావడానికి వ్యంగ్య ఖచ్చితత్వంతో అనుమతించే కవిత్వానికి" స్జింబోర్స్కాకు 1996 సాహిత్య నోబెల్ బహుమతి లభించింది. ఫలితంగా ఆమె అంతర్జాతీయంగా బాగా ప్రసిద్ధి చెందింది. ఆమె రచనలు అనేక యూరోపియన్…
Read More
వెల్చేరు నారాయణరావు (తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, పండితుడు)

వెల్చేరు నారాయణరావు (తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, పండితుడు)

వెల్చేరు నారాయణరావు (తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, పండితుడు) వెల్చేరు నారాయణరావు ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, పండితుడు. బ్రిటిషు యుగంలో భారతీయ సాహిత్యం, ముఖ్యంగా తెలుగు సాహిత్యం పాశ్చాత్య సాహిత్య పరిశోధన వల్ల ఎలాంటి ప్రథలకు లోనైందో పరిశోధించి సమగ్రమైన అధ్యయనంతో ఆ లోపాలను సరిచేసే ప్రయత్నాలు చేస్తున్న విశిష్ట పరిశోధకుడు. ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలలో బి.ఎ., ఆంధ్రవిశ్వకళా పరిషత్తులో ఎం.ఎ. పూర్తిచేసిన అనంతరం వెల్చేరు నారాయణరావు 1970లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి లింగ్విస్టిక్స్ లో డిప్లొమా అందుకున్నాడు. అనంతరం 1971లో అమెరికాలోని విస్కామన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్ లో ఉపన్యాసకునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. 1974లో ఆంధ్రవిశ్వకళాపరిషత్తు నుంచి తెలుగులో కవితా విప్లవాల స్వరూపం అంశంపై చేసిన పరిశోధనకు గాను పి.హెచ్.డి. పట్టా అందుకున్నాకా విస్కామన్సిన్ విశ్వవిద్యాలయంలోనే 1975లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, 1981లో అసోసియేట్ ప్రొఫెసర్ గా అనంతరం…
Read More
జువ్వాడి గౌతమరావు (భాషాభిమాని, సాహితీకారుడు)

జువ్వాడి గౌతమరావు (భాషాభిమాని, సాహితీకారుడు)

జువ్వాడి గౌతమరావు (భాషాభిమాని, సాహితీకారుడు) జువ్వాడి గౌతమరావు (ఫిబ్రవరి 1, 1929 - 2012) భాషాభిమాని, సాహితీకారుడు.కరీంనగర్ మండలం ఇరుకుళ్ళ గ్రామంలో 1929, ఫిబ్రవరి 1 న జువ్వాడి గౌతమరావు జన్మించాడు. కరీంనగర్‌లో విద్యాభ్యాసం సాగించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ ఎల్‌ఎల్‌బీ పట్టా పుచ్చుకున్నాడు. అతనుకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పీవీ నరసింహారావు, కోవెల సుప్రసన్నాచార్య, కోవెల సంపత్కుమారాచార్య వంటి సాహితీ మిత్రులతో అతనుకు చాలా సాన్నిహిత్యం ఉంది. కరీంనగర్ సాహిత్య చైతన్య కేంద్రంగా భాసిల్లడంలో గౌతంరావు పాత్ర ఘననీయమైనది. వరంగల్‌లో కాళోజీ, ఆదిలాబాదులో సామల సదాశివ మాదిరిగా కరీంనగర్‌లో జువ్వాడి గౌతంరావు సాహితీ వటవృక్షంగా వేలాదిమంది సాహితీకారులకు ఆశ్రయమిచ్చాడు. ఔరంగాబాద్ జైలు గోడలను ఛేదించుకొని వచ్చిన ధైర్యశాలి. కరీంనగర్‌లో తెనుగు ఉనికిని కాపాడుతూ, అనేక కవితా గోష్ఠులలో పాల్గొంటూ నిరంతర సాహిత్య సేవ చేసిన భాషాభిమాని జువ్వాడి. ఆధునిక కాలంలో అడుగంటి పోతున్న సంప్రదాయ కవితా…
Read More
ఈ అక్షరాలు అగ్నిపునీతలు

ఈ అక్షరాలు అగ్నిపునీతలు

ఈ అక్షరాలు అగ్నిపునీతలు ఈ ఎర్రని ఆకాశం రక్తం గోడల మధ్య బంధీనైఈ చీకటి కన్నీళ్ల ఎద అద్దంలో నేనునాకై నేను రాజులా తారనైరగిలే ఎద కుంపటి కటి అంగం కామాగ్నిలోఅగ్నికూపం అక్షరాలు బలి తీసుకునే చీకటి ఆలోచనలునాకై నేనే బలియవుతూ తూరుపు బొట్టుకు కాలివేలెత్తి చూపుతూనగ్నపిశాచాలు కళ్ళల్లో తిరుగుతూచీకటి ఆలోచనలు తలంటు స్నానం చేస్తూనా మనస్సు ఊబిలోకి జననాంగాన్ని జోప్పిస్తూనాలో నేను ఐక్యమవుతూ ఆ ఇరువురు నేనైరాముని అగ్నిపునీత సీత నేనొక్కడినైఆర్పేయలేని మంటల్లో ఆహుతవుతూనింగినిండా చుక్కలలో గోడల మధ్య శృంగారంనేనొక్కడినే అడవిలోని రేలపూవుల సారా మనస్సు నిండా తాగుతూ మత్తుగా,,,,,,,ఉరికొయ్యను పట్టుకుని ఊగుతూ కళ్ళు బైర్లుకమ్ముతూ గోడల మధ్య స్మశానం ప్రేమల శృంగారం జీవితం,,,,,,తరువాయి తీరిగ్గా భగవద్గీత చప్పరిస్తూ చాయి తాగుతూఅందాల లోకంలో పూవులు జలపాతంలో కొట్టుకుపోతూవన్నెచిన్నెల కలల చిన్నది కళారూపం చిత్రీకరిస్తూనా చెరసాల నిండా అక్షరాలు అగ్నిరాతలు ఆగిపోయే ఆఖరి ఆలోచనలునన్ను నేను గోముగా తల నిమురుకుంటూ ఆగిపోయిన…
Read More
అభ్యాసం విజయ రహస్యం

అభ్యాసం విజయ రహస్యం

అభ్యాసం విజయ రహస్యం సంస్కారం అమూల్యముసంపదల కన్నాసహకారం మంచిదిఅన్నింటిలో మిన్న భూషణమే వినయమునాశనమే గర్వముఏది కావాలో!నీదే తుది నిర్ణయము మంచితనం ముత్యముకాపాడును సత్యమురెండూ ఉంటేనేజీవితాన గౌరవము ఉండాలి ఆశయముచేయాలి అభ్యాసముఇక అన్నీ సాధ్యముచేకూరును విజయముకోటేశ్వరరావు ఉప్పాల
Read More
అంధకారంలో ఆశాజ్యోతి

అంధకారంలో ఆశాజ్యోతి

అంధకారంలో ఆశాజ్యోతి గుభాళించిన పూవుల కన్నా అందమైనది సున్నితమైనది ప్రేమ,,,,,,కళల పూదోటలో రకరకాల పూవులు పూస్తాయికొన్ని బహుఅందమైనవి,కొన్ని మామూలువి, కొన్ని కళ వెలిసిపోయిన పూవులు పూస్తాయి అవి అన్నిటితో పాటు తనకున్న వెలుతురును చిందిస్తాయి,,,,,,,,మనుషులలో అందరికి అన్ని అవయవాలు పుట్టుకతో సరిగా ఏర్పడకపోవచ్చు లేక లోపించవచ్చు అంతమాత్రాన చిన్నచూపు చూడకుండా వాళ్ళలో గుప్తంగా వున్న కళను జాగృత పరిస్తే మహోజ్వలమైన జీవం ఉట్టిపడుతుంది,,,,,,,కొందరు పుట్టుకతో అంధులు ఉంటారు సరియైన ప్రేమ ఆదరణ లేక తమలో తాము ఆత్మన్యూనతా భావంతో కుమిలిపోతూవుంటారు,,,,,,,,వీళ్ళకు సరియైన ప్రేమ ఆదరణ లభిస్తే అద్భుతమైన ప్రతిభ రూపుదిద్దుకుంటుంది,,,,,,,మంచి మంచి గాయకులు, సంగీత విద్వాంసులు లాంటి కళాకారులు, ఉన్నత విద్యానభ్యసించగలిగే జ్ఞానులు వెలుగులోకి వస్తారు,,,,వీళ్ళ కళలను ప్రతిభను వెలికితీసే ఆత్మీయమైన ప్రేమ రూపసులుంటే చాలు,,,,,,,తీగలు సరిచేసి వీణను మీటినట్లు నిజమైన ప్రేమతో వీళ్ళల్లో జ్ఞానతృష్ణ రగిలిస్తే హృదయం లోంచి ఉజ్వల కెరటాలు ఉప్పొంగుతాయి,,,,,,,మనిషి అందం అంతరాత్మలో ఉంది, భౌతికంగా లేకున్నా,,,,,,…
Read More