Trending Now

ఈ జీవితం క్రుళ్ళిన సమాజానికి సందేశం ఇవ్వడానికే…!

ఈ జీవితం క్రుళ్ళిన సమాజానికి సందేశం ఇవ్వడానికే…!

ఈ జీవితం క్రుళ్ళిన సమాజానికి సందేశం ఇవ్వడానికే,,,,,! ఏం సినిమాలు అబ్బాయి!?పుష్పరాజులు,బాహుబలులు ఇంకా ఎన్నెన్నో,,,,,,!భారీబడ్చేట్ ల సినిమాలు సరేఒక్క హీరో ఎన్ని వందల మందిని ఖతంప్రేక్షకులలో ఉద్రేకం రేపుతూ ఒళ్ళు గగుర్పొడిచే ఫైట్లుబూతుపాటలతో కోతి గెంతులతో సాక్షాత్తు హీరోయినే సగానికంటే ఎక్కువ బట్టలిప్పేసి రచ్చ రచ్చ వచ్చీరాని డిస్కోలు, కేబరె ఉపులు ఫుల్లుగా తాగిన మైకంలో యూత్ఇది చూసిన ఈతరం జీన్ ప్యాంట్లు చొక్కాలు ఇదే ఫ్యాషన్ ఇప్పుడు,,,,,,,,అమ్మాయిలు స్లీవ్ లెస్ జాకీట్లు అర్ధనగ్నంగా రోడ్లపై వెళుతుంటే,,,,,,పల్లికిలించి మాట్లాడుతూ వుంటే గబ్బు వాసనలకు కక్కువస్తుందిఈ పబ్బుల్లో బార్లలో అర్ధరాత్రుళ్ళు తాగుళ్లు తిండిఇందులో ఆడ మగ తేడా లేదు,,,,,ఎన్నిరోజులకు కూలిపడుతుందో ఈ వ్యవస్థసెల్ ఫోన్ల నిండా బూతులుగంటలకు గంటలు బోయ్స్ గర్ల్స్ బూతులు తాగుతూ టాకింగులుఫారిన్ కల్చరా ఇది కాదు మిడిమిడి జ్ఞానంటీవీల్లో సీరియళ్లు ఇవే వీటన్నింటి కంటే నయం సొల్లు కార్చుతూ కథ సాగబీకినా బూతులు ఫైట్లు ఉండవుచదువులు సట్టుబండలుఈ మానసిక…
Read More
జాతీయ రైతు దినోత్సవం

జాతీయ రైతు దినోత్సవం

జాతీయ రైతు దినోత్సవం జాతీయ రైతు దినోత్సవం డిసెంబరు 23 న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు. భారతదేశ 5వ ప్రధానమంత్రి, 'భారతదేశపు రైతుల విజేత' గా గుర్తింపుపొందిన చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. చౌదరి చరణ్ సింగ్ చేసిన అనేక ఉద్యమాల వల్ల జమీందారీ చట్టం రద్దై, కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది. రైతులకు బ్యాంక్ ఋణాలు అందించే విధానము ప్రవేశపెట్టబడింది. రైతుల గురించి, వ్యవసాయరంగం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి కృషిచేసిన చరణ్ సింగ్ సేవలకు గుర్తుగా ప్రభుత్వము చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది. రైతు దినోత్సవం సందర్భంగా వ్యవసాయరంగంపై చర్చలు, సదస్సులు, క్విజ్ పోటీలు, శిక్షణా శిబిరాలు, ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. చరణ్ సింగ్ మూడవ వర్థంతి (1990, మే 29) సందర్భంగా భారత ప్రభుత్వం చరణ్ సింగ్ చిత్రంతో…
Read More
డిసెంబర్ 23 ప్రత్యేకతలు

డిసెంబర్ 23 ప్రత్యేకతలు

డిసెంబర్ 23 ప్రత్యేకతలు :⁠- ✒ 1841: కలకత్తాలోని హిందూ కళాశాల నియమిత అధ్యాపకుడు, పండితుడు, కవి హెన్రీ డెరోజియో మరణం (జ.1809). ✒1902: భారతదేశ ఐదవ ప్రధానమంత్రి చరణ్ సింగ్ జననం (మ.1987). ✒1926: భారత విద్యావేత్త స్వామి శ్రద్ధానంద మరణం (జ. 1856). ✒1933: కవి, సంపాదకుడు శిరోమణి సహవాసి జననం (మ. 2007). ✒1987: వీణ విద్వాంసుడు ఈమని శంకరశాస్త్రి మరణం (జ.1922). ✒1997: పండితులు గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి మరణం (జ.1913). ✒1998: లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ కు మరణానంతరం భారతరత్న పురస్కారం లభించింది. ✒2004: భారతదేశ 9వ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు మరణం (జ.1921). మాధవి కాళ్ల
Read More
జాబిలి

జాబిలి

కన్నుల నిండా నీవే, కలల్లో నీవే, కనులెత్తి ఆ జాబిలిని చూస్తే నీ మోము నిండు చంద్ర లేఖలు రూవ్వే వెన్నెల పూవులు, విస్తుపోతూ కళ్ళు మూసుకున్నాను, ఆ అంధకారంలో వెలుగు దివ్వె నీ రూపం, నన్ను వెర్రివాన్ని చేస్తోంది, నా రోజువారి వ్యాపకాలు చేసుకోనీయకుండా,,,,, ఈ అక్షరాలు వర్ణించలేనంతగా హృదయాన్ని అల్లుకుపోయావు,,,,,తుఫాను రేయి జాబిలిలా,,,,,!! అపరాజిత్
Read More
సీ!!🚩🚩🚩

సీ!!🚩🚩🚩

సీ!!🚩🚩🚩 గోదారి యేరులై రాదారి వెంటనురక్తమ్ము బారెను రాజ్యమెల్ల!హిందుబంధువు లెల్ల హింసను భరియించినోరు తెరవరైరి యుర్విలోన!నేపాలు చూడండి పాపాలు కడుగంగబ్రహ్మపుత్రుల వలె బాటబట్టె!యిజ్రాయిలు ప్రజలు వజ్ర కవచులయ్యిభారత్కు మద్దతు పలుకుచుండ్రి!! ఆ!!వె!!🚩🚩🚩 బంగ్లదేశమందు బందూకు లెత్తిరిపరమతముల వారి పట్టిచంప!బానిసత్వమునిక భారత పౌరులుమానవలయు కృష్ణ మరువబోకు!! గడ్డం కృష్ణారెడ్డి
Read More
శ్రీనివాస రామానుజన్ వారసత్వం

శ్రీనివాస రామానుజన్ వారసత్వం

శ్రీనివాస రామానుజన్ వారసత్వం శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ (డిసెంబర్ 22, 1887 - ఏప్రిల్ 26, 1920) 20వ శతాబ్దం ప్రారంభంలో పనిచేసిన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు. స్వచ్ఛమైన గణితంలో దాదాపుగా అధికారిక శిక్షణ లేనప్పటికీ, ఆయన గణిత విశ్లేషణ , సంఖ్యా సిద్ధాంతం , అనంత శ్రేణి మరియు నిరంతర భిన్నాలకు గణనీయమైన కృషి చేశారు , అప్పట్లో పరిష్కరించలేనివిగా పరిగణించబడే గణిత సమస్యలకు పరిష్కారాలు కూడా ఉన్నాయి. రామానుజన్ ప్రారంభంలో తన సొంత గణిత పరిశోధనను ఒంటరిగా అభివృద్ధి చేసుకున్నాడు. హన్స్ ఐసెంక్ ప్రకారం , "అతను తన పనిలో ప్రముఖ ప్రొఫెషనల్ గణిత శాస్త్రవేత్తలను ఆసక్తి చూపడానికి ప్రయత్నించాడు, కానీ చాలా వరకు విఫలమయ్యాడు. అతను వారికి చూపించాల్సినది చాలా నవల, చాలా తెలియనిది మరియు అదనంగా అసాధారణ మార్గాల్లో ప్రదర్శించబడింది; వారు బాధపడలేరు." తన పనిని బాగా అర్థం చేసుకోగల గణిత శాస్త్రవేత్తలను వెతుకుతూ, 1913లో…
Read More
జాతీయ గణిత దినోత్సవం

జాతీయ గణిత దినోత్సవం

జాతీయ గణిత దినోత్సవం జాతీయ గణిత దినోత్సవం డిసెంబరు 22న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు. 2012 ఫిబ్రవరి 26న మద్రాస్ విశ్వవిద్యాలయంలో జరిగిన రామానుజన్ 125వ జయంతి ప్రారంభ వేడుకల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు. డిసెంబరు 22న దేశవ్యాప్తంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలలో విద్యా కార్యక్రమాలతో జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటారు. సంఖ్యాశాస్త్రంలో రామానుజన్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1962వ సంవత్సరంలో రామానుజన్ 75వ జన్మదినం నాడు స్మారక తపాలా బిళ్ళను విడుదల చేయడమేకాకుండా 125వ జయంతి సందర్భంగా 2012ను జాతీయ గణితశాస్త్ర సంవత్సరంగా ప్రకటించింది. 2017లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా లోని కుప్పంలో రామానుజన్ మఠ్ పార్క్ ప్రారంభించబడింది. గణితం అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది. గణిత శాస్త్రం…
Read More
నాట్యం కళల హృదయజ్యోతి,,,,,!!

నాట్యం కళల హృదయజ్యోతి,,,,,!!

నాట్యం కళల హృదయజ్యోతి,,,,,!! కళ కోసం కళ కాదుకళ ప్రజల కళ్ళ జీవనాడికళా పిపాసకుల హృదయ నేత్రం నాట్యంఒక నాట్యకళ సృజనా బీజం మొలకెత్తి మాహావృక్షమై విస్తరించడానికి భాగస్తులైన కృషీవళురెందరో,,,,,,,,సంగీతానికి అనుగుణంగా లయబద్దంగా పదవిన్యాసంతో ఒంపుసొంపుల వయ్యారంతో శరీరంలోని అనువణువు నాట్య రీతిలో భాగమై హృద్యంగా ప్రేక్షకులకు మనోల్లాసమిచ్చేది భరతనాట్యమైనా కూచిపూడియైనా అది నాట్యం హృదయాంజలి,,,,, ,,,,,,,,మాహాసముద్రమంత లోతైన భావాలను నాట్యంలో హావభావాలలో శరీరంలో అణువణువూ కళ్ళయి జీవనజ్యోతుల సాక్షాత్కారమై జ్వలించేదే నాట్యకళ,,,,,,,,,,కాళాకారుల హృదయ అంతర్భాగంలోని రసమయ ఆనంద కడలి ఉప్పొంగి తేజరిల్లే పౌర్ణమి పూసిన వెన్నెల వసంతం ముఖారవిందం ,,,,,,,,,,,,పదముల మువ్వల రవళుల మోహన మురళీ రాగాల ఢమరుక ద్వనుల నాట్యవిలాసం ఉప్పొంగే సభాసదుల కరతాల ధ్వనుల్లో నాట్యం పరమ సుఖం పవిత్రం వివశులవుదురు ప్రేక్షకులు అభిమానులు,,,,,,,,,శాస్త్రీయ నాట్యరీతులు ఎన్నెన్నో ఉద్బవించిన భారతదేశం నేటి వికృత ప్రాశ్చాత్య నాట్యరీతుల మోజులో దేశీయ నృత్యాలు కనుమరుగు కాకుండా విద్యాలయాల్లో అంశాలుగా శాస్త్రీయ…
Read More
దున్నపోతు వెర్రి లోకం

దున్నపోతు వెర్రి లోకం

దున్నపోతు వెర్రి లోకం ఈ చలి పులిలా గర్జిస్తుంటే గజగజ వణుకుతూ నీకు అగుపించని పిచ్చివాళ్ళు, బిచ్చగాళ్ళు, గరీబులు చలిలో శ్వాస ఆడక, జలుబు, దగ్గు, చలిజ్వరం అతలాకుతలం చేసినా ఎవ్వరూ పట్టించుకోక ,వీళ్ళను మనుషుల్లానే చూడని నైజం ఆటవిక మనుష్యులది. తాము ఉన్ని దుస్తుల్లో వెచ్చగా పొద్దెక్కిందాక నిదురించే వ్యవహార శైలి. అక్కడ ఎవడో పిచ్చివాడు బిచ్చగాడు చలికి, ఆకలికి తాళలేక అమ్మా అమ్మా అంటూ సూర్యోదయాన్నే అశువులు బాస్తే ,పారిశుధ్య కార్మికులు ఈడ్చుకుంటూ మున్సిపల్ వాహనంలో శవాన్ని ఊరవతల గోతిలోకి తోసేసిన విషయం ఎవ్వరికీ తెలియదు .ఇది మీడియా,ప్రభుత్వ విషయమే కాదు.సుర్రున కాలే చాయ్ తాగుతూ, తింటూ నీకు నీవే నీ బ్రతుకు గాడిద చాకిరీలో ఒక్కసారైనా అభాగ్యులకు ఏ సహాయం అందించక వీళ్ళూ నీలా మనుష్యులే నన్న ఇంగితజ్ఞానం లేని వెర్రివానివి. తూ,,, మనిషి పుట్టుకానీది మురిక్కాలువల వెంట తిరిగే పంది నయం,,,,,,,, అపరాజిత్
Read More
విరిసిన పూవులు అంతరంగమైన వేళ,,!!

విరిసిన పూవులు అంతరంగమైన వేళ,,!!

విరిసిన పూవులు అంతరంగమైన వేళ,,!! నా చేదిరిపోయిన కలలన్నీ ఈ వేళ ఓదార్పుగా పూవులై వికసించి తలలూపుతున్నాయి,,,,,,,,విషాదం నిండిన నా మోము ఒక్కసారిగా ఓ విరజాజి పూవై గుభాళించింది,,,,,,,,ఆ పువ్వులలో మకరందం గ్రోలే తుమ్మెద ఒకటి నా తలచుట్టూర తిరిగి ఓ పూవుపై వాలింది,,,,,,,,నేను రాసుకున్న విషాదకరమైన వెలిసిపోయిన గీతాలను పక్కకు నెట్టి సున్నిత మార్దవ మరులొలికే గుభాళించే ఈ పూవులపై కవనం రాయమని అంతరంగం చెబుతోంది,,,,,,,,,,,ఈ ఉషోదయంలో నులివెచ్చని సంగీతం సూర్యరశ్మి పాడుతోంది ,,,,,,,,,,,ఆ కిరణాలు స్పృశించగానే పూవులన్నీ తలలూపుతూ ఆహ్లాదకరంగా నర్తిస్తున్నాయి,,,,,,,,నాలో నేను గోప్యంగా గొణుగుకుంటున్నాను మరుజన్మంటూ ఉంటే ఓ పూవై పుట్టాలిరా,,,,,,,,,,,,,,ఈ ఆహ్లాదకరమైన పూవుల నడుమ నన్ను నేను మైమరచి ఆ అందాల సుగంధాలలో ఎప్పుడు సొమ్మసిల్లిపోయానో తెలియదు,,,,,,,,,,పడతులు నిర్దాక్షిణ్యంగా పూవుల సజ్జలు పట్టుకుని వస్తే నా కళ్ళల్లో పాపయ్యశాస్త్రి మెదిలి రెండు కన్నీటి చుక్కలు రాల్చి నా పూవులకు వీడ్కోలు పలుకలేక కళ్ళు తడుముకుంటూ వెళ్ళివచ్చాను…
Read More