ఈ ఉషా కిరణాలు,,,,,,,!!
ఈ సింధూరం పసుపు వర్ణాలు సమ్మిళిత కాంతులతో
గోరువెచ్చని కాంతులు చిమ్ముతూ తూర్పున ఉదయిస్తున్నాడదిగో ,,,,,,,,,,
ఓ గృహిణి వెచ్చని చాయ్ తయారుచేసి తాగమని పెట్టింది ఎవరికో,,,,,,,,,,
మనిషనే వాడికి చాయ్ తాగనిదే పొద్దుపోదు పొద్దుపొద్దున్నే,,,,,,,,
సూర్యుని తొలిపొద్దు అందాలు ప్రదర్శించే, ఆ వెలుగుల సౌందర్యం ఎవ్వరికీ అక్కర్లేదు,,,,,,,,,,
కాని ప్రకృతి ఆరాధకులు కొందరు చాయ్ చప్పరిస్తూ సుందర సృష్టి అందాల్లో తేలిపోతుంటారు,,,,,,,,,
ఉదయ సంధ్య మిరుమిట్లలో ఇహలోకాన్ని మైమరపించే చాయ్ లో సుందర లోకాల్లోకి తేలిపోతూ అలవిగాని ఆనందాన్ని చవిచూస్తారు,,,,,,,,,,,
పొద్దున్నే సున్నితంగా తాకే సూరీడే మధ్యాహ్నానికి భగభగల నిప్పులు కురుస్తాడు,,,,,,,,
ప్రభాత సౌందర్యం ముందు ప్రపంచంలో ఏదీ సాటిరాదు నిర్మలమైన అవని ఆకాశం కలబోసి తీసిన ఋతుచక్రం సూర్యుడే మూలం,,,,,,,,,
నీ మోజులలో చాయ్ లు, సరదా కబుర్లలో హృదయాలు విప్పలేని దౌర్భాగ్యం నిప్పుల సెగలైనా ఒప్పే నీకు,,,,,,,,,
ఆ ప్రభాతంలో అలా అలా ఊరవతల దాకా వెళ్ళి భళ్ళున తెల్లవారిందాకా గడిపి వచ్చి చాయ్ త్రాగు,,,,, ఎంత అనందమోకదా హృదయ లోగిలిలో,,,,,,,,,,,
అవున్లే అంత టైమెక్కడిది ఈ పరుగుల జీవితాలకి,,,,,, చాయ్ త్రాగుతూ సొల్లు కబుర్ల జగత్తుకు ఎంతసేపైనా కానీ,,,,,,లోకం తీరే అంతా,,,,,,,,!
– అపరాజిత్