జె.భాగ్యలక్ష్మి
జె.భాగ్యలక్ష్మి జె.భాగ్యలక్ష్మి ఇంగ్లీషు, తెలుగు భాషలలో గుర్తింపు పొందిన రచయిత్రి. ఈమె చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940 ఫిబ్రవరి 2 న జన్మించింది. దేశ రాజధాని ఢిల్లీలో స్థిరపడింది. ఈమె ఆంగ్లసాహిత్యం అధ్యయనం చేసి కమ్యూనికేషన్‌లో శిక్షణ పొందింది. అడ్వాన్స్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ రిలేషన్స్, బుక్ పబ్లిషింగ్ విషయాలలో దేశ విదేశాల డిప్లొమాలను సంపాదించింది. జర్నలిస్టుగా పేరుపొందింది. ఈమె ఇండియన్ ఇన్‌ఫర్మేషన్ సర్వీస్ (ఐ.ఐ.ఎస్) ఆఫీసరుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలో మీడియా డైరెక్టరుగా, కేంద్ర సమాచార,ప్రచార మంత్రిత్వశాఖ వారి పత్రిక యోజనకు ఛీఫ్ ఎడిటర్‌గా, పబ్లికేషన్స్ డివిజన్ ఎడిటర్‌గా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్‌కమ్యూనికేషన్స్ ప్రచురణల శాఖకు అధిపతిగా, అసోసియేట్ ప్రొఫెసర్‌గా వివిధ హోదాలలో పనిచేసింది. ఇండియన్ అండ్ ఫారిన్ రివ్యూ, కమ్యూనికేటర్ వంటి పత్రికలకు సంపాదకురాలిగా పనిచేసింది. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా, మీడియా సలహాదారుగా, మాస్ కమ్యూనికేషన్ సంస్థలలో గెస్ట్ ఫాకల్టీగా పనిచేస్తోంది. ఈమె ప్రభుత్వ పత్రినిధిగా, జర్నలిస్టుగా వివిధ…