ఆత్మ నా?
ఆత్మ నా? అవి బతుకమ్మ పండగ రోజులు... నేను, నా స్నేహితులు కలిసి చిన్న బతుకమ్మలు చేస్తూ, రోజూ ఆడుకుంటూ కాలువలో నిమజ్జనం చేసేవాళ్ళం. అలా రోజు బతుకమ్మను పేర్చుకుంటూ సంతోషంగా సాయంత్రం కాగానే ఇంటి ముందు ముగ్గులు వేసుకుని కాసేపు అడుకుని కాలువకు ప్రసాదాలు తీసుకుని వెళ్ళేవాళ్ళం. అమ్మ రోజు ఏదో ఒక ప్రసాదం చేసి ఇచ్చేది. నా స్నేహితులకు అమ్మ చేసే ప్రసాదం అంటే చాలా ఇష్టం. బతుకమ్మ వేయడం ఆలస్యం నా ప్రసాదం మొత్తం వాళ్ళే లాక్కుని మరి తినేవాళ్ళు. నాకు మిగల్చకుండా.. అలా ఒకరోజు బతుకమ్మ ఆడుకుని కాలువలో నిమజ్జనం చేయడానికి వెళ్ళినప్పుడు, మా వెనకాలే ఎవరో వస్తున్నట్టు అనిపించింది. కానీ మేము వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరు. మామూలుగా కాలువ సైడ్ సాయంత్రం పూట ఎవరు ఉండరు. దూరంగా పశువులను ఇళ్లకు తోలుకొస్తూ ఎవరో ఒకరు కనిపిస్తారు. కాని దగ్గరగా రారు. అక్కడ…