అల్లరులు
అల్లరులు ఉదయం లేస్తూనే మొదలుపెట్టారా? అబ్బబ్బా నావల్ల కావట్లేదు మీతో అంటూ వంటింట్లోంచి అరుస్తుంది సుధ. ఏమైందిపుడు ఎపుడు చూసినా పిల్లీ ఎలుకల్లా ఎందుకురా అలా ఉంటారంటూ బాల్కనీలో పేపర్ చదువుతున్న సాకేత్ లేచి వెళ్ళాడు. చూడండి నాన్న నాకు ఇవాళ కాలేజ్ లేదని పడుకుని ఉంటే మీద నీరు పోసాడు అంటూ తన వాదన వినిపించింది కూతురు దీపిక. అదేం కాదు డాడీ పొరపాటుగా పడ్డాయి దానికే ఇంత రాద్ధాంతం చేస్తుంది అంటూ సంజాయిషి ఇచ్చాడు హరి. అయినా పదవుతుంటే లేవకుండా వాడిమీద చాడీలు చెప్తున్నావా ఆడపిల్లవని తెలుస్తుందా నీకసలు అంటూ కొడుకు పక్కన చేరింది తల్లి సుధ. వచ్చేసావా... వాడిని ఏమైనా అనడం పాపం ప్రత్యక్షమైపోతావు అంటూ దీపిక వాళ్ళ డాడీని చూసి నవ్వింది. అంతే అంతే నిజం చెప్పావురా దీపు అంటూ వంతపాడాడు తండ్రి సాకేత్. హా... అవునవును ఇపుడు మీరు మాత్రం మీ కూతురు పక్షం…