aksharalipi chalimanta

చలిమంట

చలిమంట చలిమంటలా జ్ఞాపకాలు జ్వలిస్తుంటే ఆవలిస్తున్న మనసుకు కీ ఇచ్చి రివైండ్ మోడ్ లో ఉంచాను కుప్పపోసినట్టు పాతవాళ్ళందరు ఒక్కచోట చేరిన అనుభూతి! కాలం పుప్పొడిలా కంటతడి కానుకై గుండె నిమురుతోంది కట్టె కాలిపోయాక బూడిదైపోయిన ఈ 'నేను' ఎవరిని చూసి మాట్టాడుతుంది బతుకు పరిమళాన్ని పారబోయటం మానేసి బంధాలను నేయటం చివరిలోన్నా నేర్చుకుందాం తప్పొప్పుల చిట్టాను చలిమంట చేద్దాం - సి. యస్ .రాంబాబు
Read More