aksharalipi dosita nimpina varalu

దోసిట నింపిన వరాలు

దోసిట నింపిన వరాలు డిసెంబర్ నెల చివరి వారం.. ఊరు ఊరంతా చలికి తట్టుకోలేక సాయంకాలానికే పనులన్నీ ముగించుకొని ఇళ్లల్లో చేరి తమకు ఉన్నంతలో వేడివేడిగా వండుకొని తిని ముసుగుతన్ని పడుకునే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటి సమయంలో తాటాకు గుడిసె ముందు ఎముకలు కొరికే చలికి గజగజ వణికిపోతూ మునగ తీసుకొని కూర్చొని ఉన్నాడు రాజు. అతని కళ్ళు మాటిమాటికీ గుడిసె తలుపుల వైపు ఆశగా చూస్తున్నాయి. అవ్వ, అయ్యలు కరుణించకపోతారా తనను లోపలికి పిలవకపోతారా అని. నిద్రాహారాలు మాని రెండు రోజుల నుంచి ఎదురు చూసి చూసి కాయలు కాచిన కళ్ళు కన్నీటిని వర్షిస్తుండగా కన్నీటితో చారికలు కట్టి కందిపోయిన పాలుగారు బుగ్గలను తుడుచుకున్నాడు. పదిహేడేళ్ళ వాడి పసిప్రాయం వాడికి జీవితానికి సరిపడా గుణపాఠాలను నేర్పింది. బాల్యం నుండి యవ్వన ప్రారంభదశలోకి అడిగిడే క్రమంలో లోకమంతా రంగులమయంగా కనిపిస్తూ అదుపెరగని ఆనందాలన్నింటినీ ఆస్వాదించడానికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా అనిపిస్తుంది. అలాంటి పరిస్థితులలో…
Read More