aksharalipi nakshatra maala

నక్షత్ర మాల

నక్షత్ర మాల నే చూసిన అందాల నగరం నక్షత్రాల మాలలు ధరించి కదలకుండా చూడమన్నది కళ్లు తిప్ప కుoడా చేసింది ఉన్న చోటునే మరిచేలా ఊహించ మన్నది ఆ నక్షత్రాల వరుసను చేరి అప్రయత్నంగా గగనతలంలో ఆకాశపందిరి నుండి వేలాడినట్టు సంబరమనిపించే సౌధాలు అందమైన అద్భుత కట్టడాలు మనిషి మేధస్సును మెచ్చుకుంటూ నక్షత్రాలన్ని మిరమిట్లు గొలుపుతూ అబ్బురపరిచాయిఆహాఅన్నట్లు చీకటనేదిన లేదుగా మన అనుభూతుల సమాహారoలో మినుకు మినుకుల ఆకాశపు హరివిల్లు నుండి వరుస కట్టిన నక్షత్రాలు కుచ్చి వేలాడ తీసినట్టు.....? - జి జయ
Read More

నక్షత్ర మాల

నక్షత్ర మాల అందమైన ఆకాశంలో అలజడులు రేపుతూ వెచ్చని కిరణాల తాకిడి తో మేనంతా కవ్విస్తూoటే మది సరికొత్త రాగాలు ఆలపిస్తుంది మనసంతా మరో రేయి నీ కోరుతుంటుంది  నీ వెచ్చని శ్వాస తగులుతూంది హృదయమoతా భారమౌతుంటే సుమాలమాలలు గుండెల్లో గునపాలై గుచ్చుతాయి ఎద లోతుల్లో ప్రేమనంతా దాచుకోలేక నక్షత్రమాలను మెళ్ళో అలంకరించుకుని  చిలిపిగా చూస్తున్న నీ దరికి చేరలేక విరహపు బాధను తాళలేక నీ సతిని నేనై నా పతివి నీవై అందరాని ఆ సుదూర తీరాలను చేరేదెన్నడో నీ ప్రేమ సామ్రజ్యాన్ని ఏలేదెన్నడో... - భవ్య చారు
Read More