aksharalipi nyayamaa neevekkada

న్యాయమా నీవెక్కడ

న్యాయమా నీవెక్కడ అందాల చిన్ని పాప ఆడుకుంటూ పాడుకుంటూ చదువు కోసం బడికి వెళ్తుంది. అక్కడ పొంచి ఉన్న ఒక రాక్షసుడి కన్ను ఆ పాపపై పడింది. వాడు ఊరుకుంటాడా అనుకున్నదంతా చేశాడు. పాపం పుణ్యం ఎరుగని ఆ పాప ఏడుస్తూ ఇంటికి వచ్చింది ఏం జరిగిందని తల్లి అడిగినసరికి ఆ పాప ఆ రాక్షసుడు గురించి చెప్పింది. ఆ మాటలు విన్న తల్లి గుండె పగిలింది నిజమో అబద్దమో పాప ఏం చేస్తుందో అసలు అర్థం కాలేదు. అవన్నీ నిజాలే అని తెలుసుకోవడానికి ఆమెకి కాస్త సమయం పట్టింది. ఆ సమయంలో ఆమె చాలా నిజాలనే తెలుసుకుంది. తన పాప ఒకటే కాదనుకుంటూ ఇంకా చాలామంది చిన్నారులను చిదిమేసిన ఆ రాక్షసుడిపై పోరాటానికి దిగింది. పోరాటం పెద్దల వరకు వెళ్ళింది. పెద్దలు ఎన్నో రకాలుగా వారిని మబ్బ పెట్టేందుకు ప్రయత్నం చేశారు. మహిళా సంఘం వాళ్ళు దిగి మీకు న్యాయం…
Read More

న్యాయమా నీవెక్కడ

న్యాయమా నీవెక్కడ న్యాయవాదుల నల్లకోటుల్లోనా? బడాబాబుల బంధీఖానాల్లోనా? బరితెగించిన అధికారంలోనా ? భూ బకాసురుల హస్తాల్లోనా? కార్పోరేట్ కబంధాల్లోనా? రాజనీతి కుతంత్రాల్లోనా మాఫియా సామ్రాజ్యంలోనా? అవినీతి అధికారుల జేబుల్లోనా? నీతిలేని వ్యాపారుల కనుసన్నల్లోనా? చట్టాల చట్రాల ఇరుసుల్లోనా? అందరాని విద్య అంచుల్లోనా? దురాచారాల దౌర్భాగ్యంలోనా ? దుస్సాహసుల ద్వంద నీతిలోనా? కవిరాయని కల్పితపు రాతల్లోనా? పెట్టుబడిదారుల పెత్తనం లోనా? అహంకారపు అంచుల్లోనా? ఆది పత్యపు పోరులోనా? మానవ మృగాల పైశాచికత్వం లోనా? సత్యమెరుగని సమాజం లోనా? అర్హులనే వారు ఎవరైనా ఉంటారా న్యాయానికి? నమ్ముకుని కూచుంటే దొరుకుతుందా న్యాయం అని సందేహమే? అంగట్లో కొనే సరికాదు అందరికీ న్యాయం అంటే? ఖరీదు కట్టే న్యాయమే వద్దు ఎప్పటికీ సామాన్యుని ఆగ్రహావేశాలు చవి చూడకుండా న్యాయమా కదలిరా ఇప్పటికైనా.... - జి జయ
Read More

న్యాయమా నీవెక్కడ

న్యాయమా నీవెక్కడ న్యాయమా నీవెక్కడ...?? చట్టానికి చుట్టమా... రాజకీయానికి బానిసవా..? ఎక్కడా.. నీవెక్కడ కనపడవే.. పేదింటి గడప నీ కంటికి కనపడదా.. పేదోడి కన్నీరు నీకు పట్టదా... పేదోడి గుండె ఘోష... నీకు వినపడదా... న్యాయమా నీవెక్కడ... ఎవరి కోసం ఉన్నావు... అన్యాయం తో అల్లాడుతున్న పేదోడి ఆవేదన కనపడదా.. ఆకలితో చేయి చాచడానికి వస్తే కాలికింద తొక్కేసే వారి గర్వం నీకు కనపడదా... న్యాయమా నీవెక్కడ.. తప్పులు చేసి దర్జాగా తిరిగే వారి అహంకారం నీకు కనపడదా... చట్టాన్ని చుట్టంలా వారి పిడికిలితో బంధించే వారి పొగరు నీకు కనపడదా... ఎక్కడున్నావ్ నువు న్యాయం అని నీ దగ్గర గోడు వెల్ల బోసుకునే వారిని కానక అధికారం తో గర్వంతో, పొగరుతో, అహంకారంతో డబ్బు వ్యామోహంతో ఏదైనా చెయ్యొచ్చు అని తలపోగరుతో తల ఎగరేసే వాడి తల నరకగా రావే... ఏ ఎందుకు..? అన్యాయం ముందు.. నీవు చేతులు ముడుచుకుంటూ…
Read More