aksharalipi pramaadaalu

ప్రమాదాలు

ప్రమాదాలు 1. ఆ.వె.  వాహనముల తీరు వరుసగా కథనాలు  పేపరంత వార్త పేర్చు చుండ  ఇన్ని ఘోరములను "ఈ టీ వి"చూపినా  మనసు మార్చుకొనడు మానవుండు 2. ఆ.వె.  తండ్రి ఋణము దీర్చు తరుణమాసన్నమై  ఫలితమందు కొనగ పాకులాడు  కన్న కలలు అన్ని కల్లలాయెను గదా  తలకు రక్ష లేక తనువు బాసి 3. ఆ.వె.  పుచ్చకాయ రీతి పుర్రె పగిలి పోవు  ఎద్దు వంటి వాడు ముద్ద యగును  బండి ముక్కలగును బాడి రక్తమగును  కన్న వారలంత కలత జెందు 4. ఆ.వె.  ఏ ప్రయాణమైన హెల్మెటు ధరియించు  కన్న బిడ్డల గను కనుల ముందు  వేగమెప్పుడైన వేదన కలిగించు  ఆలి చెప్పు మాట నాలకించు - కోట
Read More