స్వేచ్ఛ భారతదేశ ప్రజలు దేశంపై ఉంచుకున్న ఆకాంక్షలు, ఆశయాలు, కోరికలు ఈ పీఠికలో స్పష్టమైన అక్షరాలలో తెలపబడ్డాయి. భారత రాజ్యాంగానికి ఆత్మగాను, హృదయంగాను పీఠికను పిలుస్తారు. మారుపేర్లలో ఒక పేరు మూలతత్వం, మరొకటి పరిచయం, ఇంకొకటి ఉపోద్ఘాతం - ఈ పదాలు వివరించిన విధంగానే పీఠిక రాజ్యాంగంలోని సర్వస్వానికి ఒక సారాంశంగా చెప్పుకోవచ్చు. 1949 నవంబర్ 26 న రాజ్యాంగ సభ పీఠికను ఆమోదించగా, 26 జనవరి 1950న అమలులోకి వచ్చింది. స్వాతంత్య్రానంతరం మన దేశ పాలనకు దిక్సూచిగా రూపొందించబడిన భారత రాజ్యాంగం నేడు ప్రమాదంలో పడుతోంది. ఆనాడు డా. బి.ఆర్.అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడిన రాజ్యాంగ పరిషత్ అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, అనేక చర్చలు, మేధోమధనం జరిపి రాజ్యాంగాన్ని రూపొందించింది. రాజ్యాంగ రూపకల్పన సమయంలోనే వివిధ పార్టీలు అభిప్రాయాలు చెప్పే సందర్భంలో ఆనాటి కొత్తగా రాజ్యాంగ రచన అవసరం లేదనీ, మనుధర్మాన్నే మన రాజ్యాంగంగా ప్రకటించాలని... చెప్పిన విషయాన్ని…