తస్మాత్ జాగ్రత్త!!
తస్మాత్ జాగ్రత్త!! శరీర సంగమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ..... జీవితాలని సంగ్రామంగా చేసుకున్న జంటలు ఎన్నో! పొద్దంతా అలక పానుపులు, రాత్రి కాగానే పూలపాన్పు. ఈ కామ దాహం లో కళ్లుమూసుకుపోయి, పిల్లల్ని అశ్రద్ధ కి గురి చేస్తున్న మూర్ఖపు తల్లి తండ్రుల సంఖ్య వేలల్లోనే! ఇలాంటి ఇంట పెరిగిన పిల్లల మానసిక ప్రవృత్తి సక్రమంగా ఉండదు. వీరిని మానసిక శాస్త్రంలో నెగ్లెక్టెడ్ చిల్డ్రన్ అంటారు. వీరు తరగతిలోనో, విద్యలోనూ, క్రీడలలోను అధికశాతం వెనుకబడి ఉంటారు. బెడ్ రూంలు వేరుగా లేకపోతే ఆ భార్యాభర్తలు ఏదో పాపకార్యం చేసినట్టు చింపాంజీ మొహాలు పెట్టే అమ్మ, లయ్యలు ఎందరో ఈ లోకంలో. సంగమ ప్రాప్తికై ఆరాటపడి విడాకులు పొందిన జంటలు ఎన్నో........! ఇలా పవిత్ర బంధాన్ని అశ్లీలత గా మార్చి జీవితాలని కుంపట్లు గా మార్చుకున్న కథనాలు కోకొల్లలు.. ఇదో పవిత్ర బంధం. ఈ బంధానికి తీపి గుర్తు మన పిల్లలు. వీరి ఆలనా,…