amma

అమ్మ

అమ్మ కనిపించే ఆ దైవం అమ్మ కని పెంచే దాతృత్వం అమ్మ తొలి గురువు అమ్మ స్వర నాదం అమ్మ జన్మజన్మల అనుభందం అమ్మ అనుభూతుల అనురాగం అమ్మ మమతల మల్లెలు అమ్మ తియ్యని మకరందం అమ్మ కలతలులేని కంచుకోట అమ్మ కరుణ చూపేకామితం అమ్మ కమ్మని మమతల కోవెల అమ్మ గుప్పెడు ఆశల చప్పుడు అమ్మ రంగుల హరివిల్లు అమ్మ కమ్మని రుచుల కారుణ్యం అమ్మ నవరసాల నవనీతం అమ్మ మనసున్న మాణిక్యం అమ్మ విరిసిన పూతోటా అమ్మ చిరు ఆశల సుమమాల అమ్మ మంచిని చూపే మార్గదర్శి అమ్మ వెలుగునిచ్చే జ్ఞాన ధాత అమ్మ కలబోసిన కనకధారా అమ్మ నిను మెచ్చే వరమిచ్చే ఆ దైవం అమ్మ వెలలేని దీవెన అమ్మ కొనలేని గ్రంధం అమ్మా అమ్మంటే అంతులేని సంతోషం అందరికీ ...... - జి జయ
Read More

అమ్మా…

అమ్మా... అమ్మా...! నీ మీద ప్రేమ చెప్పటానికి కూడా అవకాశం వస్తుందనుకోలేదు. అమ్మా...! చిన్నతనంలో, నీమీద ఇష్టాన్ని చూపించడమంటే, నీకు దగ్గరగా వచ్చేవారిని  వారించటంలో చూపించాను. నువ్వు నన్ను తప్ప ఎవరిని ప్రేమగా చూసినా, వారిని ద్వేషించడంలో, నీమీద ఇష్టాన్ని చూపించాను. నాకు పుట్టినరోజు అయినా, పండగ అయినా నీతో చేసుకుంటే చాలు అనుకుంటానమ్మా, నాకు నీకు లోకంగా వుండాలని, ఒక్కదాన్నే వుండాలి అనుకున్నాను. ఎవ్వరి మీద ద్వేషం లేదమ్మా నీమీద ఇష్టం మాత్రమే, అందరి మీద కన్నా ఎక్కువ వుంది. నచ్చని పని అయినా, చెయ్యనంటూ చేస్తూ ఉండటంలోనే, నాప్రేమను చూపించానమ్మా. పట్టుమని పదిరోజులు కూడా నీకు దూరంగా వుండలేక ఏడ్చినప్పుడు,ఆఏడుపులో నా ప్రేమను కనిపించలేదా అమ్మా!   పెళ్ళి చేసుకుంటే, నువ్వు ఆనందపడతావని నీకు దూరంగా వుండాలని తెలిసికూడా,నీకు నచ్చినట్టు,నీఆనందం కోసం పెళ్ళికి ఒప్పుకుని అందులో నా ప్రేమను చూపించానమ్మా. అడగందే అమ్మ కూడా పెట్టదంటారు. కానీ,మా అమ్మను  అడగక్కర్లేదు.నాకు అవసరమైనవి తనే…
Read More

అమ్మ

అమ్మ పిల్లలకైనా.. పిల్లలను కన్న తల్లిదండ్రుల కైనా గుర్తొచ్చే పదం అమ్మ.. కష్టాలకు కావలి కాస్తూ, కన్నీళ్లకు వారధి వేస్తూ.. దుఃఖాన్ని దండిస్తూ.. బాధలను బంధీని చేస్తూ.. పేగు బంధాన్ని ప్రేమ బంధంతో ముడివేస్తూ.. తప్పటడుగులు సరిచేస్తూ ... జీవితానికి బాటలు వేస్తూ... ఆనందానికి అవధులు లేకుండా అడ్డుకట్ట వేస్తూ.. మకుటం లేని మహారాజుల వెలుగొందాలని... ఆశ పడని.. ఆరాట పడని తల్లి ఉందా... - మల్లి ఎస్ చౌదరి 
Read More