అనుకోకుండా ఒక రోజు
అనుకోకుండా ఒక రోజు చలికి తాళలేక ఊరంతా అరింటికే సద్దుమునిగింది. ఎడవుతుండగా వేడి వేడి అన్నం తినేసి, రగ్గులు కప్పుకుని మునగధీసుకున్నారు ఊర్లోని జనం. దాదాపు అందరు పొద్దున్నే లేచేవారు కాబట్టి అలసిపోయి నిద్దర్లోకి జారిపోయారు. నాకు కూడా బాగా చలిగా అనిపించడం తో రగ్గు తీసుకుని కప్పుకున్నా, బస్సు మెల్లిగా వెళ్తుంది. ఇక ఇదే ఆఖరు స్టేజ్ కావడంతో నేను ఒక్కడినే బస్సు లో ఉన్నాను. అదే చివరి బస్సు కూడా మా ఊరికి. అనుకోకుండా ఎబివిపి బంద్ కు పిలుపునివ్వడంతో ఆ నాలుగు రోజులు హాస్టల్ లో ఉండలేక ఇంటి మీద బెంగ తో అలాగే హాస్టల్ ఆహారం తిని కడుపు ఎలాగో ఉండడం వల్ల అమ్మ చేతి వంట తినొచ్చు అనే ఉద్దేశ్యంతో సాయంత్రం ప్రయాణం అయ్యాను. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా సర్ప్రైజ్ ఇవ్వాలని నా చిలిపి ఆలోచన. ఇంతలో బస్ ఆగింది. కండక్టర్, డ్రైవర్ ఇద్దరూ…