అన్వేష్ – కథానిక
అన్వేష్ - కథానిక నేనో ఫ్యాన్సీ షాపులో మొదలుపెట్టి దానికి అటాచ్డ్ గా కాఫీషాపు తెరిచి కొత్త ఆలోచనకు పునాదివేశాను. నా ప్రయోగంఫలించి మరికొంతమందికి ఆ ఆలోచన వచ్చింది.. నా భుజం నేను తట్టుకున్నాను. నిజం చెప్పాలంటే నా భార్య ఐడియా అది. కానీ తను నా అంత చదువుకోలేదు కాబట్టి అది నాదిగా చెలామణి అయింది. కాదు చేశాను. ఆలోచన వేరు, దాని అమలు వేరు అని సమాధాన పరుచుకున్నాను. నేను క్రెడిట్ ఇవ్వలేదని తనూ అడగదని తెలుసు. అలా నా అంత బాగా వ్యాపారం మరొకరు చేయలేరని విర్రవీగుతున్న సమయంలో కొవిడ్ వచ్చి అందరిలాగే నన్నూ అతలాకుతలం చేసేసింది. లాక్ డౌన్ లో వర్కర్స్ వెళ్ళిపోయారు. మొదట్లో భయం వల్ల బిజినెస్ గురించి ఎక్కువ ఆలోచించలేదు. నెమ్మదిగా దాచుకున్న డబ్బంతా కరిగిపోవటం మొదలయ్యాక ఏంచేయాలో అర్థం కాలేదు. నా భార్యేమయినా చెప్పబోయినా విసుక్కునేవాడిని. పిల్లల గురించి బెంగా మొదలయింది.…