bharadwaj

ఎవరు పార్ట్ 8

ఎవరు పార్ట్ 8 “లక్ష్మి, ఏంటి అలా మౌనంగా ఉన్నావు?” “మౌనం ఏమి ఉంది, పని చేస్కుంటున్నా, రేపే మహేష్ గారి పుట్టిన రోజు, చాలా పనులు ఉన్నాయి.” “లేదు. ఎందుకో కోపంగా ఉన్నావు” “మీ మీదా?” అవును అన్నట్టు తల ఆడించాను. “మీ మీద నాకు ఎందుకు కోపం” “కోపం లేకపోతే మొహం ఎందుకు చాటేస్తావు?” “రాయుడు గారు, నా పని నన్ను చేసుకోనివ్వండి. మీరు ఇక్కడ అధికారి, అధికారం చూపిస్తే అందంగా ఉంటుంది, అలా కాకుండా ఇలా అమ్మాయిలు మీద అనురాగాలు కురిపిస్తే ఉన్న పని, పనితో పాటు పరువు రెండూ పోతాయి.” కాస్త ఘాటుగానే మాట్లాడింది. “కనీసం ఇది అనురాగం అని అర్ధం అయ్యింది, లేకపోయి ఉంటే ఇంకా ఎన్ని అనే దానివో. వస్తాను” అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న నాకు అద్దంలో నన్ను తను చూస్తున్నట్టు కనిపించింది. ఈ అమ్మాయి అర్థం కాదు. ఎందుకు ఇలా…
Read More

ఎవరు పార్ట్ 7

ఎవరు పార్ట్ 7 “అలీ.. ఈ లేఖ ఏంటి? ఇది నీ దగ్గర ఉంది ఏంటి?” అలీ తలుపు దగ్గరికి వెళ్లి ఎవరైనా ఉన్నారా అని చూసి, తలుపులు దగ్గరికి వేసి, నా దగ్గరికి వచ్చి “ఈ లేఖ నారాయణ భూపతి గారికి వచ్చింది” “నారాయణ భూపతి?” అలీ: “అవును, మహేష్ భూపతి గారి తాత గారు, భూపతి రాజు తండ్రి గారు.” “ఏమి రాసి ఉంది?” అలీ: “అమ్మి అప్పగింపు ఆయుష్మణం, గడియ గాంచిన యామంతం” “అర్ధం కావట్లేదు.” అలీ: “దీన్ని అర్ధం చేసుకోవటానికి నాకూ వారం పైనే పట్టింది. క్లుప్తంగా నాకు అర్ధం అయ్యింది ఇది. నారాయణ భూపతి గారి దగ్గర ఎవరో నాయకుడు అప్పు తీసుకున్నాడు. అది తీర్చని కారణంగా నారాయణ భూపతి వాళ్ళ అమ్మాయిని తీస్కుని వచ్చేసాడు. ఆమెను తిరిగి ఇవ్వకపోతే ఆ అమ్మి శాపం తగులుతుందని రాసి ఉంది.” “అయితే ఊరిలో పుకారు నిజమేనా?…
Read More

ఎవరు పార్ట్ 6

ఎవరు పార్ట్ 6 నేను ఏది ఏమైనా ఈ ఉదయం చాలా బాగుంది, నేను తాగుతున్న కాఫీలా. అలా అలా తాకి వెళ్లే చల్ల గాలి, చూడగానే మనసుకి హాయి కలిగించే పచ్చని కొండలు, వాటి అందాన్ని దాచే పొగమంచు. వింతగా అనిపించింది. ఎప్పుడూ ఉండే కొండలే, రోజు చూసే పొగమంచే, అలవాటైన కాఫీయే కానీ కొత్త అనుభూతి. “ఏంటి, కళ్ళు తిరిగి పడిపోయినప్పటి నుండి వ్యాయామం మానేసినట్టు ఉన్నావు.” వెనకనుండి అలీ. “అలాంటి ప్రత్యేకమైన రోజులు మళ్ళీ మళ్ళీ రావు” “అర్థం కాలేదు” అలీ “మీకు వ్యాయామం చేయాలని ఉందా?” అని మాట దాటేశాను. అలీ “పరుగెత్తటాలు నా వల్ల కాదు కానీ, వాతావరణం బాగుంది కదా అలా నడుచుకుంటూ వెళదాం.” నడక ఆరంభించాము. అలీ “భాయ్, నేను ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను.” “నీకు నచ్చినన్ని రోజులు ఉండు, నువ్వు అతిథిలాగా మొహమాటపడద్దు.” అలీ “అతిథి…
Read More

ఎవరు పార్ట్ 5

ఎవరు పార్ట్ 5 అలీ నీళ్లు చల్లి లేపాడు. లేవగానే తాగటానికి నీరు ఇచ్చి, నేను పైకి లేచిన వెంటనే “ఏంటి వ్యాయామమా ?” వీడికి అలా అర్థం అయ్యిందా! “ఆ... అలాంటిదే. నువ్వు... ఇక్కడ” “నేను ఒక పని ఉండి వచ్చాను” బట్టలు దులుపుకుంటూ “అందరూ పని ఉండే వస్తారు. ఆ పని ఏంటి అని?” “నేను నాటక రచయితను. ఊరు మారితే ఆలోచనలు మారతాయి అని కొత్త కొత్త ప్రదేశాలు చూస్తూ ఈ ఊరు వచ్చాను. కానీ ఇక్కడ జనాలు మరీ విచిత్రంగా ఉన్నారు. నీ లాగా.. ” “ఇంకా కొన్ని రోజులు ఇక్కడ ఉండు, నీకు నేను దేవుడిలా కనిపిస్తాను.” అని నాకు నీరు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపి నేను ఇంటికి వెళ్తుండగా “నాకు ఇక్కడ నివసించటానికి ఒక ఇల్లు కావాలి” ఇతను మాట్లాడుతున్నదానికి అడుగుతున్నదానికి సంబంధం లేదు అనిపించింది. కానీ నాతో ఎవరన్నా ఉంటె నాకు…
Read More

ఎవరు పార్ట్ 4

ఎవరు పార్ట్ 4 అలీ షాకారులో ఇంటికి వెళ్తున్నంత సేపు నా సంచిలో పత్రాలు ఎలా పోయాయి, జట్కా బండి ఎందుకు లేదు అనే ఆలోచనలో ఉండిపోయాను. భవంతి రాగానే మహేష్ గారు, నేను కారు దిగి లోపలికి వెళ్తున్నాము. మహేష్ గారు “ఏమి ఆలోచిస్తున్నావు?” “ఏమి లేదు సార్” అని నా ఆలోచనలని కప్పేసుకున్నాను. “ఆ పోలీస్ నీ దగ్గర ఎంతో కొంత డబ్బు తీసుకోవచ్చని అలా అని ఉంటాడు. నువ్వు అది మనసులో పెట్టుకోకు. వెళ్లి విశ్రాంతి తీసుకో.” “సరే” అని చెప్పి నేను అతిథిగృహానికి వెళ్తుండగా ఒక పెద్ద అరుపు వినిపించింది. వెనక్కి తిరిగి చూసాను, పని అమ్మాయి గట్టిగా అరుస్తూ, కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ఆమె చూస్తున్న వైపు చూసాను. నాలుగు అడుగుల బాణం భూమి లోకి దిగి ఉంది, పక్కన భూపతి గారు కింద పడి ఉన్నారు. నేను పరిగెట్టుకుంటూ వెళ్లి, ఆయనను…
Read More

ఎవరు పార్ట్ 3

ఎవరు పార్ట్ 3 "ఈ చోటు అంత మంచిది కాదు. అందులోనూ నీలాంటి భయస్తులు ఇక్కడ ఉండటం చాలా కష్టం. జాగ్రత్తగా ఉండు.” తెల్లవారు ఝామున నిద్ర పట్టటం వల్ల, ఉదయం చాలా ఆలస్యంగా లేచాను. లేచిన వెంటనే బయటకి వచ్చి భవంతి వైపు చూసాను. అంతా నిశ్శబ్దంగా ఉంది. దగ్గరకు వెళ్లి గమనించాను. అంతా మాములుగానే ఉంది. ఎవరి పనిలో వారు ఉన్నారు. మనసు కొంచెం కుదుట పడింది. అప్పుడు నాకు పరీక్షా సమావేశం ఉంది అని గుర్తుకు వచ్చి, ఉరుకు పరుగులు మీద పనులన్ని ముగించుకుని భవంతిలో మహేష్ భూపతి గారి ఆఫీస్ కి బయలుదేరాను. “ఎందుకు ఆ హడావిడి? పెద్దవాళ్లు ఎప్పుడు ఆలస్యంగా వస్తారు! నువ్వు కంగారు పడి, ఆ కంగారులో తిక్క తిక్క సమాధానాలు చెప్పి ఉన్న అవకాశం చెడగొట్టుకోకు.” అని మనసులో నాకు నేనే సర్దిచెప్పుకొని లోపలికి అడుగుపెట్టాను. అప్పటికే ఆయన నా కోసం…
Read More

ప్రేమ కవిత

ప్రేమ కవిత ప్రేమ వందేళ్ల వరమా... జీవించడానికి బలమా... పుట్టుకతో పొందే గుణమా... చావుని సైతం భయపెట్టే గర్వమా... పుడమిని నడిపించే ప్రాణమా.. జన్మ జన్మలకు వీడిపోని వీడ లేని నేస్తమా... అలుపెరగని సుదీర్ఘ యుద్దమా... జీవిత కాలం బంధమా... చెప్పవమ్మా ఓ కాలమా...! - భరద్వాజ్ ( BJ Writings )
Read More

ఎవరు పార్ట్ 2

ఎవరు పార్ట్ 2 అక్కడ నుండి నేను వెనక్కి తాతతో పాటు ఊరు లోకి వచ్చేసాను. తాత “బాబు.. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి?” “భూపతి రాజు గారి భవంతికి దారి చెప్పు తాత” “నేను అక్కడికే వెళ్తున్న. ఇంతకీ నువ్వు ఎవరు?” “భూపతి రాజు గారి ఎస్టేట్ కి కొత్త నిర్వాహకుడిగా వచ్చాను కానీ ఆయన చనిపోయారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో?” తాత “నన్ను బదిలీ చేస్తుంది నువ్వేనా?” ఒక నిముషం నాకు మాట రాలేదు. తాత నవ్వుతూ “ఏంటి మౌనంగా ఉండిపోయావు.” “ఏమి లేదు...” ఒక క్షణం ఆగి “మీ పేరు?” “మర్రిటి పోతన” “పోతన గారు, మీరు ఏమి అనుకోను అంటే ఒక ప్రశ్న?” “ఈ పిలుపు కన్నా ఇందాక వరకు నువ్వు పిల్చిన తాత అనే పిలుపే బాగుంది….” నాకు కొంచెం ఊపిరి ఆడినట్టు అనిపించింది. “ఎందుకు మిమ్మల్ని బదలీ చేసారు.” “వయసు వల్ల అవ్వచ్చు.…
Read More

ఎవరు పార్ట్ 1

ఎవరు పార్ట్ 1 అరగరాగా అలీ అనే ఒక అతను అప్పుడే కొత్తగా కట్టిన రైల్వే స్టేషన్ ముందు బయట టాయిలెట్ పోసుకుంటూ, ఎవరైనా గమనిస్తున్నారా అని అటు ఇటు చూస్తూ ఉంటాడు. అంతలో ఒక గెడ్డం వాడు ఒక బ్యాగ్ వేసుకుని, మనిషి లాగే రెండు చక్రాల రిక్షా దిగి అతని బ్యాగ్ కూడా అలీ బ్యాగ్ పక్కన పెడతాడు. అతని మొహం కన్నా జుట్టు ఎక్కువ ఉండటం వల్ల, అతను చూడటానికి వింతగా కనిపించాడు అలీకి. ఆ రిక్షా వాడికి డబ్బులు ఇచ్చి అతను బ్యాగ్ తీస్కుని స్టేషన్ వైపు పరిగెడతాడు. అతను ఎందుకు ఆలా పరిగెడుతున్నాడో అర్థం కాక అలీ జిప్ పెట్టుకుంటూ తన బ్యాగ్ తీసుకుంటాడు. ఆ బ్యాగ్ అతనిది కాదు అని చూసుకుని అలీ ఆ గెడ్డం వాడి వెనకాల పరిగెడతాడు. అలీ: “ఏయ్.... ఏయ్... అది నా బ్యాగ్”. గెడ్డం అతను ఇంకా…
Read More

కిల్లర్

కిల్లర్ రెండు వారాల ముందు... "మీకెందుకు ఇబ్బంది హోటల్లో రూమ్ తీసుకుంటాను కిరణ్ గారు" అని మాటవరసకి అన్నాడు వరుణ్. "బలే వారే! నాకేం ఇబ్బంది లేదు సార్... మీరు రండి..." అంటూ బైక్ స్టార్ట్ చేసాడు కిరణ్. బస్ స్టాండ్ నుండి హైవే వైపు బండి స్పీడ్ గా వెళ్ళింది. నాలుగు గంటల జర్నీ అంత పరిచయంతోనే వరుణ్ ని ఇంటికి పిలుస్తాడు కిరణ్. ఊరి చివరికి చేరుకుంటారు. హైవేకి దగ్గరలో కొత్తగా కట్టిన అపార్ట్మెంట్లోకి వెళ్తుంది బైక్.  "చాలా ప్రశాంతమైన ప్లేస్ కదా సార్ చుట్టూ ఉన్న ఖాళీ ప్లేస్ చూస్తూ" అంటాడు వరుణ్. చిన్నగా నవ్వి, "అవును సార్ నైట్ హైవే మీద వెళ్ళే వెహికల్స్ సౌండ్ కాస్త ఇబ్బంది" అంటాడు కిరణ్ బైక్ పార్క్ చేస్తూ.... ఇద్దరు లిఫ్ట్ లో వుంటారు. వరుణ్ ఎదురుగా ఉన్న లిఫ్ట్ యొక్క గ్రిల్స్ డోర్ ద్వారా దాటుతున్న ఒక్కో ఫ్లోర్ ని…
Read More