book reviews

అలజడుల స్మృతి గీతాలు

అలజడుల స్మృతి గీతాలు గజల్ గాయనిగా జ్యోతిర్మయి మళ్ల మనకు సుపరిచితులు. కవితాత్మక కథనంతో బాల్య స్మృతులుగా కొద్ది కాలం కితం ఆవిష్కరించిన వారు ఇటీవలే కథల పుస్తకాన్ని వెలువరించారు. మొత్తం పదిహేను కథలుంటే వాటిలో ఎనిమిది కథలు రోజుకూలీల జీవితాల కష్టాలను, కడగండ్లను చూపుతాయి. భావం, శైలిలకు సమన్వయం కుదిరితే ఆ కథ మంచి కథవుతుందంటారు విమర్శకులు. ఆ సమన్వయం చాలా కథలలో కనిపిస్తుంది. చెమటచుక్కలను సిరా చేసి రాసినట్టనిపించే కథలివి. ఎక్కువ కథల్లో వృద్ధుల వెతలు కనిపిస్తాయి. అందుకు కారణం నిరాశ్రయులయిన ఎందరో పెద్దవారిని తమ తల్లి ఆశ్రయమిచ్చిందని, వారి వెతలే కథలుగా ప్రాణం పోసుకున్నాయంటారు రచయిత్రి. శ్రీకాకుళం యాస తీయగా పలకరిస్తుందీ కథలలో. మోతాదుకు మించిన నాటకీయత, సినిమాటిక్ మలుపులు లేకుండా సహజంగా కథలివి.కథల్లోని పాత్రలతో మనమూ ట్రావెల్ చేస్తాం. మొక్కజొన్న పొత్తులు కొంటామేమోనని ఎదురు చూసే మనుషులు రైల్వే క్రాసింగ్ ల వద్ద, బస్టాండ్ల్లోను తారసపడుతుంటారు.…
Read More

అనువాద పటిమతో అందంగా తెలుగులో ‘ది గైడ్’

అనువాద పటిమతో అందంగా తెలుగులో 'ది గైడ్' అనువాదం చేయాలంటే సామర్థ్యతో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలి. క్రమశిక్షణ ఎందుకంటే అనువాదానికి లొంగని వాక్యాలు ముప్పతిప్పలు పెడుతుంటే దాన్ని ఎదుర్కోవటానికి క్రమశిక్షణ మనోనిబ్బరాన్ని ఇస్తుంది కాబట్టి. క్రమశిక్షణ ఒక్క రోజులో పొందేది కాదు. అదో జీవిత కాలపు సాధన. వేమవరపు భీమేశ్వరరావు గారు ఫిజిక్స్ బోధిస్తూ హోమియోపతి వైద్యాన్ని నేర్చుకుని ఎంతోమందికి వైద్యం చేశారు. బోధన, వైద్యం రెండింటికీ ఎంతో శ్రద్ధగా శుశ్రూత చేశారు. ఈ క్రమంలో ఎదురైన సవాళ్ళను కఠోర క్రమశిక్షణతో సాధించారు. అంతేనా తన డెబ్బయ్యవ పడిలో ఆర్కే నారాయణ్ నవలలను తెలుగువారికి పరిచయం చేయాలనిపించింది ఆయనకు. ఇప్పటికే waiting for mahatma (నవల), my days (ఆత్మ కథ), lolly road (కథలు) పుస్తకాలకు అనువాదరూపమిచ్చి మన్ననలు పొందారు. ఎందుకో ఆర్కే నారాయణ్ రచనలను మనవాళ్ళెవ్వరూ తెలుగులోకి తెచ్చే ప్రయత్నం అంతగా చేసినట్టు కనబడదు.. అనువాద రచనకు…
Read More

పగలు, ప్రతీకారాల విస్ఫోటనం

పగలు, ప్రతీకారాల విస్ఫోటనం కొందరి పుస్తకాలు సమీక్షించాలంటే స్థాయి సరిపోదు. శక్తి చాలదు. అలాంటి రచయితల్లో యండమూరి వీరేంద్రనాథ్ ముఖ్యులు. టాక్ తో సంబంధం లేకుండా మాస్ సినిమాకు కలెక్షన్లొచ్చినట్టు ఆయన పుస్తకమేదైనా హాట్ కేకులా అమ్ముడుపోవాల్సిందే. ఈమధ్య ఎక్కువ నాన్ ఫిక్షన్ రచనలపై దృష్టిపెట్టిన ఆయన ఓ నవలను ఈమధ్యే పాఠకులకు కానుక చేశారు. ఆ నవల *నిశ్శబ్ద విస్ఫోటనం*. అప్పుడే రెండో ఎడిషన్ కూడా వచ్చేసింది. విమర్శకులెప్పుడూ యండమూరిని సీరియస్ గా తీసుకోలేదు. ఆయనా వీరిని పట్టించుకోలేదు. పాఠకుల అభిప్రాయాలే గీటురాయిగా ఆయన భావిస్తారు. ఆశ్చర్యంగా *నిశ్శబ్ద విస్ఫోటనం* నవలపై పాఠకుల నుంచి మిశ్రమ స్పందనలొచ్చాయి. అవేమీ రెండో ఎడిషన్ ని ఆపలేకపోయానుకోండి. అది వేరే విషయం. ఆయన నవలలు వెండితెరపై చూడటానికన్నా చదువుకోవడానికి హాయిగా ఉంటాయి. ఈ నవల కూడా ఆ కోవకు చెందిందే. యండమూరి నవలల్లో హీరోయిన్ 'ఐక్యూ' ఎక్కువ. ఇక్కడ కూడా హీరోయిన్ ఎత్తులకు…
Read More

పలుకుతేనెల వ్యాసార్ధం

పలుకుతేనెల వ్యాసార్ధం   కొన్ని పుస్తకాలు ఒక భావపరిమళాన్ని మనలో వ్యాపింపచేస్తాయి. ఎంచుకున్న అంశాలు... ఆ అంశాలను ఆవిష్కరించిన తీరు మనలను ముగ్ధుల్నిచేస్తాయి. మళ్ళీ మళ్ళీ చదివిస్తాయి. కథో, నవలో అయితే కొంత కాల్పనికత బరువును మోస్తాయి. అయితే పుస్తకమో వ్యాససంకలనమయినప్పుడు అది వ్యాసార్ధమై రచయిత హృదయ వైశాల్యాన్ని ఆవిష్కరించే వెన్నెల జాబిలి కావొచ్చు. అసలు వ్యాసమంటే వచనం కదా. వచనం రాసి మెప్పించటం అంత సులువు కాదు. వ్యాసం అందంగా ఆకట్టుకోవాలంటే పదాల కూర్పు, పొహళింపు వ్యాసానికి మరింత అవసరం అని గుర్తించాలి. అందుకే చాలా వ్యాసాలు భారంగా సాగుతూ చదువరిని ఆకట్టుకోవు.... అందుకు భిన్నం వోలేటి పార్వతీశంగారి వ్యాస సంకలనం "వ్యాసార్థం". ఆకాశవాణి, దూరదర్శన్ లలో ప్రయోక్తగా నాలుగు దశాబ్దాల అనుభవం, స్వరమాంత్రికుడిగా అనేక సభలలో ఆశువుగా మాటలను అల్లేనేర్పు, రచనా వారసత్వం ఇవన్నీ కలిసి ఈ పుస్తకాన్ని అక్షర పరిమళంతో నింపేశాయి. సౌకుమర్యాన్ని పరవశంతో పరిచాయి. అందుకే ఈ…
Read More

కూతలరాయుడు పుస్తక సమీక్ష

కూతలరాయుడు పుస్తక సమీక్ష నవతరం కూత ఇది బోర్ కొట్టించే రచయితలున్నట్టే కొంతమంది బోర్న్ రచయితలుంటారు. అలాంటివారి వెలుగు మనలను వెతుక్కుంటూ వస్తుంది. ఇదిగో ఆ వెలుగు పుంజమే కూతలరాయుడు aka సాయి కౌలూరి. బాగా రాయాలంటే బాగా చదవలన్న కాన్సెప్ట్ కు ఇలాంటి కూతలరాయుళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుతూ నాకసలు చదివే అలవాటే లేదండీ అని నమ్మకంగా చెబుతారు. మరెలా సాధ్యం.. నీ అసాధ్యం కూలా అని మనమనుకోవాలి.. సరే ఆ విషయాలను పక్కన పెట్టేస్తే చాలారోజుల తరవాత ఎత్తిన గ్లాసు దించనట్టు చేతిలోకి తీసిన పుస్తకాన్ని దించకుండా చదివే అవకాశం సాయి కౌలూరి మనకు కల్పించాడు.. *అ* నుంచి *ఋ* అక్షరక్రమంలో కథలను గల్పికలు, నవలికలతో మనలను చుట్టేస్తాడు. అదీ తన ప్రత్యేకత. వాక్యాల వర్షమా అది.. వెన్నెల వర్షం.. అమ్మా, నాన్నల అనుబంధంతో మొదలైన కథాపర్వం అపురూపంగా సాగుతుంది. ఆంగ్ల భాషా పదాలను వద్దని అందరూ అంటారు గానీ.. ఒడుపుగా వాడటం…
Read More