hima

నిరీక్షణ

నిరీక్షణ చుట్టూ నిరాశా నిస్పృహలు ఆనందపడాల్సిన ఒక్క విషయం అంటూ లేదు ఎక్కడో దాగిన వైరాగ్యం మనసుని నన్ను తనవశంలోకి తీసుకెళ్తుందేమో అనే అనుమానము ఉప్పెనలాంటి ఈ కన్నీళ్ళని తుడిచేవారికోసమే నా నిరీక్షణ నా నిరీక్షణలు సఫలమై నువ్వు నన్ను నీ ప్రపంచంలోకి ఆహ్వానించి నాపై కురిపించిన ఈ ఆనందపు ఝల్లులతో తడిసి నీ రక్షణలో ఇలా నిండు నూరేళ్లు ఉంటే - హిమ
Read More

వేదన

వేదన ఆడపిల్ల మనసు సముద్రమంత లోతు మగవాడి మనసు సముద్రమంత విశాలం ఇద్దరూ పడే వేదన మాత్రం సముద్రఘోషలాగా ఉంటుంది మనసు పడే ఆ వేదన వర్ణించడానికి వీలుకాదు వివరించేందుకు మాటలు లేవు ఈ ఆవేదనే అనురక్తిగా అత్యంత శక్తిగా మారి ఒక కొత్త పునాదికి నాంది కావాలి - హిమ
Read More

గతం

గతం గతం నిన్ను నడిపే దిక్సూచి కావాలి గతాన్ని నెమరవేసుంటూ గమనాన్ని గుర్తుపెట్టుకొని గతం చేసిన గాయాన్ని మదిలో తలచుకొని వేసే ప్రతిఅడుగు నిర్దిష్టమైన ప్రణాళికతో గమ్యం వైపుకి వెళ్లే ప్రయాణాన్ని గట్టిగా ప్రయత్నించి చేరాలి - హిమ
Read More

బంధం

బంధం స్తబ్దత నిండిన మనసుని సైతం శృతిలయల సంగమంగా మార్చగలిగేది ప్రపంచం అంతా ఏకమై , నిన్ను అపహాస్యం చేసినా నీకై నీకోసమై ప్రతిఘటించగలిగేది పగవాళ్ళ చురకత్తి లాంటి మాటలను సైతం తన మాటలతో నీకు ఉపశమనం కలిగించేది నీకన్నా నీగురించి ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా ప్రేమ చూపించగలిగేది బంధం చాలా ముఖ్యమైంది, అమూల్యమైనది, అనిర్వచనీయమైనది బంధం నిలుపుకోవడానికి ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడుగు వేయకు బంధాలను బంధంతో బంధించు.. -హిమ
Read More