జాతర
జాతర వేష భాషలేవైనా ప్రకృతిమాత వొడిలో సోయగాల ఊయలలో వుప్పొంగిన మనసుతో పశు పక్షాదుల పలకరింపులు కొండా కోనల్లో సంబరమనిపించే సామాన్యుడి ఉత్సవం సాగిపోయే జనంతో నిండిన సంద్రంలో పరుగులే ప్రభంజనంగా జన సంద్రపు జాతర సాంప్రదాయ సంఘంలో ఓ గులకరాయి జాతర బ్రతుకే పండుగా అందొక చిన్ననాటి చిరుజ్ఞాపకం. ఆ అనుభూతి అమోఘం ఆ ఆనందం అద్భుతం ఆ ప్రదేశం మదిలో ఓ జ్ఞాపిక. - జి.జయ