కలగంటే సరిపోదు.!
కలగంటే సరిపోదు.! పచ్చని ప్రకృతి నడుమ చిరిగిన నిక్కరు మెడలో కండువా వేసుకుని పశువులను మేపుతున్న ఓ ఎనిమిదేళ్ల పిల్లాడు.. ఒకరోజు పొలంలో ఆకాశం వైపు చూస్తూ పరిగెడుతున్నాడు.. గుట్టలు ఎక్కుతూ గట్లను దాటుతూ.. పడుతూ, లేస్తూ, ముందు ఏముందో చూడకుండా పరిగెట్టడానికి కారణం ఆ పిల్లాడికి నింగిలో శబ్దం చేస్తూ పక్షిలా దూసుకుపోతున్న ఓ విమానం... వాడికి ఎందుకో దానిని చూస్తే పట్టరాని ఆనందం. అది ఆకాశంలో మబ్బుల మాటున దాగి ముందుకు పోతుంటే సాధ్యమైనంత దూరం పరిగెడుతూ దాన్ని సాగనంపడం వాడికి ఓ సరదా... ఎప్పుడో ఒకసారి ఆకాశంలో అలా చిన్నగా కనిపించే విమానాన్ని చూడడం ఎంతో గొప్పగా భావిస్తుంటాడు. దిగువ మధ్యతరగతి కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు.. తండ్రి సంపాదనపైనే ఇంటిల్లపాది గడపాల్సిన పరిస్థితి. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఆ పిల్లాడికి అంతకన్నా పెద్దపెద్ద ఆశలు ఏముంటాయిలే అనుకోవడం సహజం.... కానీ వాడలా అనుకోలేదు.…