kali poem

కలి

కలి కలికాలంరో, బాబోయ్ కలికాలంరో, ఆకలి అంటే అర్థాలు "వేలు" ఉండునురోయ్ ! అసలే పట్టనిది పేదోనిదిరోయ్ ! పట్టినా, పట్టునది ధనికుడిదిరోయ్ ! అస్సలు ఎకసక్యమే కానిది నాయకునిదిరోయ్ ! నిత్యక్షుద్భాద వ్యాపారి దిరోయ్ ! కలికాలం రోయ్, బాబోయ్ కలికాలంరోయ్, ఆకలి అంటే అర్థాలు 'వేలు' ఉండును రోయ్ ! కడుపు నిండన్కి బుక్కెడు, గుక్కెడు గంజి చాలును రోయ్ ! అది కూడా దక్కదు పేదోనికి రోయ్ ! పేరు మార్చి 'సూపు' అంటారు మన తారలురోయ్ బక్క చిక్కి అందం అంటారు వీరిని ఏమనాలిరోయ్ ! - వాసు
Read More