kota

మహిళా శక్తి

మహిళా శక్తి 1) ఆ.వె.     అబలగాదు మహిళ.ఆదిపరాశక్తి     కరుణజూపుతల్లి.కనకదుర్గ     ఆపదున్న వేళ ఆదుకోజూచును     జాలిగుండె కరిగి.మేలు చేయు 2) ఆ.వె.      వనిత చేతగాని పనిలేదు వసుధలో      నేర్పు.ఓర్పుగలిగి నెలత చేయు      అలసటెరుగకుండు ఆలనా పాలనా      కన్న సంతు సమము కరుణ జూపు 3) ఆ.వె.      నేటి మహిళ లంత మేటిగా పోటీకి      పురుషుల సమమంటు పోరు సలిపి      విజయమందిరి తమ విజ్ఞానమును జూపి      అన్ని రంగములను ఆక్రమించి 4) ఆ.వె.      అంతరిక్షమంత "అవలీల"గా తిరిగి      రణము గెలిచి "రమణి"రాజ్యమేలె      రాజకీయమందు రాణించె "లేమలు"      రాష్ట్రపతిగ "ప్రతిభ"రాణకెక్కె 5) ఆ.వె.     కదనరంగమందు.కడలియంచులయందు    …
Read More

కరోనా..(ఆటవెలదులు)

కరోనా..(ఆటవెలదులు) 01)లాకుడౌను వల్ల లాసైన దేశము రెండవ అలవల్ల రెంటజెడెను గుర్తు పట్టనంత గుట్టుగా వ్యాపించి కాటికంపు చుండెగా కరోన 02) చాపకింద నీటిచందాన దరిజేరి ఆనవాలు లేక అంటుకొనును సబ్బుతో కరములను శుభ్రంగ కడగాలి కాదు కూడదంటె కలుగు ముప్పు 03) చేతులెత్తి మొక్కు షేకుహాండివ్వకు దరికిబోయి దాన్ని తగులుకోకు మరల తిరిగి వచ్చె మాయదారి కరోన మాస్కు బెట్టి దాన్ని మట్టుబెట్టు 04) భౌతికముగ ఎడము పాటించి తీరాలి ఒరుసుకుంటు తిరుగ ఒంటికంటు ఎడము ఉండవలెను ఏ జనమెదురైన లెక్క జేయకుంటె ప్రక్క జేరు... - కోట పెంటయ్య
Read More